ఉస్మానియా యూనివర్సిటీ: గ్రూప్ 1 పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో టీజీపీఎస్సీ వైఫల్యంపై బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చటారి దశరథ్ ఆధ్వర్యంలో ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేశారు. వర్సిటీ మెయిన్ లైబ్రెరీ ఎదుట విద్యార్థులు ప్లకార్డులతో శాంతియుత నిరసన తెలిపారు. ఈ సందర్భంగా దశరథ్ మాట్లాడుతూ.. గ్రూప్ 1 పరీక్షల నిర్వహణలో విఫలమైన టీజీపీఎస్సీ చైర్మన్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
పరీక్ష నిర్వహణ, మూల్యాంకనంలో లోపాలు ఉన్నాయని న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టు ప్రభుత్వానికి మొట్టికాయలు వేసేలా తీర్పు ఇచ్చిందని పేర్కొన్నారు. కోర్టు తీర్పుతో గ్రూప్ 1 ఉద్యోగ నియామక ప్రక్రియలో అవకతవకలు జరిగినట్లుగా తేటతెల్లమైందని అన్నారు. అయితే లైబ్రెరీ ఎదుట శాంతియుత నిరసన తెలుపుతున్న విద్యార్థులను పోలీసులు అడ్డుకుని వారిని బలవంతంగా అంబర్పేట్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కడారి స్వామి, కార్యదర్శులు జంగయ్య, ప్రశాంత్, నాయకులు బొల్లు నాగరాజు, శ్రీకాంత్, నాగేందర్రావు, రాకేశ్, సాయిగౌడ్, సంజయ్, రాము తదితరులు పాల్గొన్నారు.
చిక్కడపల్లి, సెప్టెంబర్11: కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను అమలుచేయాలని ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠాగోపాల్ అన్నారు. నిరుద్యోగులకు మద్దతుగా గురువారం చిక్కడపల్లి సిటీ సెంట్రల్ లైబ్రరీ వద్ద నిరసన తెలుపుతున్న బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌తో పాటు నాయకులను అరెస్ట్ చేసి ముషీరాబాద్ పోలీస్ స్టేషన్‌కు తరలించచారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ముఠాగోపాల్, బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ పీఎస్‌కు చేరుకుని బీఎర్ఎస్వీ నాయకులకు సంఘీభావం తెలిపారు. నిరుద్యోగుల డిమాండ్ మేరకు గ్రూప్-1 పరీక్షలను మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ యువ నాయకుడు ముఠా జయసింహ అన్నారు. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అల్లాపూర్, సెప్టెంబర్11: కాంగ్రెస్ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే గ్రూప్-1 పరీక్షల్లో అవకతవకలకు పాల్పడినవారి పై విరచారణ చేపట్టి కఠనంగా శిక్షించాలని బీఆర్ఎస్వీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.అశ్వంత్ కుమార్ డిమాండ్ చేశారు. గ్రూప్-1 పరీక్షల్లో జరిగిన అవకతవకలను ఎండగడుతూ బీఆర్ఎస్వి ఆధ్వర్యంలో జేఎన్టీయూ వద్ద నిరుద్యోగ విధ్యార్థులతో కలిసి గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని డిమాండ్ చేశారు. అయితే జేఎన్టీయూ పోలీసులు శాంతియుతంగా నిరసన చేపడుతున్న వారిని అరెస్టు చేసి పోలీసు స్టేషన్‌కు తరలిచారు. అరస్టైనవారిలో బీఆర్ఎస్వీ నాయకులు.. అఖిల్ కళ్యాణ్, రాజు, గోల్కొండ రాజు, విక్రమ్, శివ, శ్రావణ దుర్గ, అక్షయ, రమణ తదితరులు పాల్గొన్నారు.
మాదాపూర్, సెప్టెంబర్ 11: గ్రూప్ 1పై ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ప్రశ్నించేవారిని అరెస్టు చేయడం మాని జీవో నం 29 రద్దు చేయాలని శేరిలింగంపల్లి బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఎర్రబెల్లి సతీష్ రావు కోరారు. గ్రూప్ 1 పరీక్షపై రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన తీర్పుతో.. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వైఫల్యం తేటతెల్లమైందన్నారు. పరీక్షలో అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తు కమిషన్ సభ్యులు రాజీనామా చేయాలని గురువారం జేఎన్టీయూ యూనివర్సిటీ ప్రధాన గేటు వద్ద నిరుద్యోగ విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ శాంతియుత నిరసన కార్యక్రమం చేపట్టింది. గ్రూప్ 1 అభ్యర్థులకు న్యాయం జరిగేంత వరకు బీఆర్ఎస్వీ, బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటాయన్నారు. అనంతరం నిరసన తెలుపుతున్న నిరుద్యోగ, నాయకులను కేపీహెచ్బి పోలీస్ స్టేషన్‌కు తరలించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్వి నాయకులు యశ్వంత్ కుమార్, అఖిల్, కల్యాణ్, రాజు, విక్రమ్, శివ, శ్రావణ, దుర్గ అక్షయ, రమణ తదితరులు ఉన్నారు.