షేక్‌పేట్, నవంబర్ 5: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీకే అన్నివర్గాల మద్దతు ఉందని మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. బుధవారం షేక్‌పేట్ డివిజన్ దత్తాత్రేయనగర్కాలనీలో మాజీమంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి, బీజేఆర్ నగర్లో మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి, ఆదిత్యనగర్ కాలనీలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, బృందావన్ కాలనీలో మాజీ ఎమ్మెల్యే షకీల్.. ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటువేసి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను గెలిపించాలని ఓటర్లను కోరారు.
అభివృద్ధి కోసం బీఆర్ఎస్ను గెలిపించాలి
మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్

ఘట్కేసర్, నవంబర్ 5: అభివృద్ధే ప్రధాన లక్ష్యంగా పని చేసిన బీఆర్ఎస్నే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలిపించాలని ఘట్కేసర్ మున్సిపల్ బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ కోరారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని వెంగళ్రావు నగర్ ప్రాంత కార్పొరేటర్ దేదీప్యతో కలిసి 141, 142, 143 బూత్‌లలో కారు గుర్తుకే ఓటు వేయాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రాంతాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి, ఆదర్శంగా తీర్చిదిద్దిన మాగంటి గోపీనాథ్‌ను దృష్టిలో పెట్టుకుని మాగంటి సునీతా గోపీనాథ్‌ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బోడుప్పల్ బీఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి, మాజీ కౌన్సిలర్ నర్సింగ్ రావు, నాయకులు సదానంద, జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ ఎండీ సిరాజ్ తదితరులు పాల్గొన్నారు.
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ను గెలిపించండి
బీఆర్ఎస్ రాష్ట్ర నేత వంటేరు ప్రతాప్‌రెడ్డి

కేపీహెచ్‌బీ కాలనీ, నవంబర్ 5 : జూబ్లీహిల్స్ నియోజకవర్గ అభివృద్ధికి మాగంటి సునీతా గోపీనాథ్‌ను ఆదరించాలని, కారు గుర్తుకు ఓటేసి గెలిపించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బాలాజీనగర్ డివిజన్ కార్పొరేటర్ పగుడాల శిరీషాబాబురావు కోరారు. బుధవారం ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ గెలుపుకోసం కార్పొరేటర్ శిరీషాబాబురావు, బీఆర్ఎస్ నేతలతో కలిసి వంటేరు ప్రతాప్‌రెడ్డి పాదయాత్ర చేశారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని, పేదల కష్టాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆ పార్టీకి కనువిప్పు కలుగాలంటే ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్, తదితరులు ఉన్నారు.
హామీల అమల్లో సర్కార్ విఫలం
బాలానగర్ కార్పొరేటర్ రవీందర్‌రెడ్డి

బాలానగర్, నవంబర్ 5 : హామీల అమల్లో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని బాలానగర్ కార్పొరేటర్ ఆవుల రవీందర్‌రెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా బుధవారం ఎర్రగడ్డ డివిజన్లో.. సిద్దిపేట మాజీ మున్సిపల్ చైర్మన్ రాజ నర్సు బృందం, ఎర్రగడ్డ డివిజన్ బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు. కరపత్రాలు పంపిణీ చేసి కారు గుర్తుకు ఓటు వేయాలని ఓటర్లను కోరారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతా గోపీనాథ్‌ను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు.