KTR | హైదరాబాద్, మే 1 (నమస్తే తెలంగాణ): లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా జీహెచ్ఎంసీ పరిధిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం నుంచి రోడ్‌షోలు నిర్వహించనున్నారు. మే 2 నుంచి 7వ తేదీ సాయంత్రం వరకు నిర్వహించనున్న ఈ రోడ్‌షోల్లో భాగంగా సికింద్రాబాద్, చేవెళ్ల, మల్కాజిగిరి లోక్‌సభ నియోజకవర్గాల పరిధిలో ఆయన ప్రచారం చేయనున్నారు.
తొలి రోజు గురువారం జూబ్లీహిల్స్, కూకట్పల్లి, 3న సికింద్రాబాద్ , సనత్‌నగర్, నాంపల్లి, 4న కుత్బుల్లాపూర్, మేడ్చల్, కంటోన్మెంట్, మల్కాజిగిరి, 5న ఎల్బీనగర్, ఉప్పల్, ముషీరాబాద్, 6న శేరిలింగంపల్లి, రాజేంద్రనగర్, మహేశ్వరం, 7న ఖైరతాబాద్, అంబర్‌పేటలో కేటీఆర్ రోడ్ షోలు ఉంటాయి.