KTR | హైదరాబాద్ : తెలంగాణ ఉద్యమకారుడు, ప్రముఖ కార్మిక నాయకుడు, BHEL ఎల్లయ్య మరణం పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర, కార్మికుల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు అపూర్వం అని కొనియాడారు.
సాధారణ కార్మికుడిగా జీవితం ప్రారంభించి, బీహెచ్ఈఎల్ కార్మికులందరికీ ఒక బలమైన గొంతుకగా మారిన ఎల్లయ్య జీవితం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. కార్మిక లోకానికి ఆయన చేసిన సేవలు ఎప్పటికీ గుర్తుండిపోతాయి. వారి మరణం కార్మిక లోకానికే కాక, తెలంగాణ సమాజానికి కూడా తీరని లోటు. ఎల్లయ్య ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు, అనుచరులకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను అని కేటీఆర్ పేర్కొన్నారు.