హైదరాబాద్, సెప్టెంబర్ 22 (నమస్తేతెలంగాణ): ‘ఆరు గ్యారెంటీలు, అభయాస్తం పేరి ట అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పండి..కారుకు ఓటేసి హస్తం పార్టీ నేతలకు’ అంటూ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్ల కు పిలుపునిచ్చారు. ఏమాత్రం ఎమరుపాటుగా ఉన్నా మూడేళ్లు అరిగోసపడాల్సివస్తుం దనే విషయం మరువద్దని ఉద్బోధించారు. రాష్ట్రం మొత్తం జూబ్లీహిల్స్‌వైపు చూస్తున్న త రుణంలో సరైనా నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తిచేశారు.
కేసీఆర్ మళ్లీ రావాలన్నా.. మా గంటి గోపినాథ్ ఆశయాలు నెరవేరాలన్నా బీఆర్ఎస్ అభ్యర్థిని ఆదరించాలని కోరారు. సోమవారం తెలంగాణభవన్‌లో బొరబండ డివిజన్ బీఆర్ఎస్ బూత్‌స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేసీఆర్ పదేళ్ల పాలనకు ప్రస్తుత కాంగ్రెస్ పాలనకు తేడాను వివరించారు. నాడు అమలుచేసిన అనేక అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రస్తుత కాంగ్రెస్ సర్కారు చరమగీ తం పాడిందని ధ్వజమెత్తారు. షాదీ ముబారక్ కింద రూ. లక్షతో పాటు తులం బంగారం ఇస్తామని, రూ. 2 వేల పింఛన్‌ను రూ. 4వేలకు పెంచుతామని మొండి చెయ్యి చూపిందని నిప్పులు చెరిగారు.
కోర్టు ఆదేశాలను ధిక్కరించి దుర్మార్గం..
సెలవు రోజుల్లో కూల్చివేతలు వద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను కాంగ్రెస్ సర్కారు తుం గలో తొక్కుతున్నదని నిప్పులు చెరిగారు. శని, ఆది వారాల్లో హైడ్రా పేరిట కూల్చివేతల తో అరాచకం సృష్టిస్తున్నదని ధ్వజమెత్తారు. గాజులరామారంలో ఎంగిలిపూల బతుక మ్మ పండుగను కూడా చూడకుండా బుల్డోజర్లను పంపి 200 నిరుపేదల ఇండ్లను నేల మట్టం చేయడం దుర్మార్గమని దుయ్యబట్టారు.
గతంలో బొరబండకు చెందిన బీఆర్ఎ స్ నేత సర్ధార్‌ను వేధించి, వెంటాడి బలితీసుకున్నదని ఆరోపించారు. ‘కొడంగల్‌లోని రెడ్డికుంటలో సీఎం రేవంత్‌రెడ్డి.. దుర్గంచెరువులో ఆయన అన్న తిరుపతిరెడ్డి..హిమా యత్‌సాగర్ ఎఫ్టీఎల్లో మంత్రి వివేక్, ఆపార్టీ నేతలు కేవీపీ, ఉస్మాన్‌సాగర్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఇండ్ల’ను వదిలివేసి నిరుపేదల నివాసాలను నిర్ధాక్ష్యిణంగా కూ ల్చివేయడం బాధాకరమన్నారు. అరాచకాలు సృష్టిస్తున్న హస్తంపార్టీకి అడ్డుకట్ట వేయ కుంటే ఇండ్లను కూల్చే హైడ్రాకు లైసెన్స్ ఇచ్చినట్టేనని స్పష్టం చేశారు.
కేసీఆర్ పాలనలో అభివృద్ధి..ఇప్పుడు అధోగతి
కేసీఆర్ పదేండ్ల పాలనలో నగరం అభివృద్ధి పథంలో పయనించిందని చెప్పారు. కులమ తాలకతీతంగా ప్రజలందరూ అన్నదమ్ములూ కలిసిమెలిసి ఉన్నారన్నారు. పదేళ్లలో ఏనా డు ఆంధ్రా, తెలంగాణ పంచాయితీలులేవని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ వచ్చిన తర్వాత నగరం దోపిడీలు, డ్రగ్స్‌కు అడ్డాగా మారిందని ఆరోపించారు. ఇప్పుడు నేరాలు ఘో రాలు నిత్యకృత్యమయ్యాయని దుమ్మెత్తిపోశారు.
అన్నివర్గాలు, అన్ని రంగాలు అతలా కుతలమయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాడు 42 ఫ్లైఓవర్లు, 39 ఎస్టీపీలు నిర్మిం చామని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ 22 నెలల పాలనలో ఏ ఒక్క ఫ్లైఒవర్కు కూడా పు నాది రాయివేయలేదన్నారు. కొత్త పథకానికి కొబ్బరికాయకొట్టలేదని విమర్శించారు. కానీ కేసీఆర్ పూర్తిచేసిన అభివృద్ధి పనుల రిబ్బన్లు కట్ చేసేందుకు సీఎం రేవంత్‌రెడ్డి జే బులో కత్తెరపెట్టుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
చెయ్యి గుర్తుకు ఓటేస్తే ఫ్రీ వాటర్ బంద్..
కేసీఆర్ కరోనాకాలంలోనూ ఏ పథకాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. ‘నయాపైసా రాబడి రాకున్నా పింఛన్లు ఆపలేదు..షాదీముబారక్, కల్యాణక్ష్మి స్కీంలను బంద్పెట్టలేదు.. డబుల్బెడ్రూం ఇండ్ల నిర్మాణాన్ని నిలిపివేయలేదు..’ అని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ సర్కారు మాత్రం కేసీఆర్ పథకాలకు చరమగీతం పాడుతున్నదని ధ్వజమెత్తారు. నా యీబ్రాహ్మణుల సెలూన్లకు, రజకుల లాండ్రీలకు ఫ్రీ కరెంట్ ఎత్తేసేందుకు కుట్రలు చేస్తున్నదని నిప్పులు చెరిగారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు పూర్తికాగానే 20 వేల లీటర్ల ఫ్రీ వాటర్ స్కీంను ఎత్తేసేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. ఇదే విషయం గతంలో సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో స్పష్టంగా చెప్పిన విషయాన్ని ప్రస్తావించారు.
జూబ్లీహిల్స్ విజయమే గోపన్నకు నివాళి..
జూబ్లీహిల్స్‌లో బీఆర్ఎస్ సాధించే ఘన విజయమే మాగంటి గోపినాథ్‌కు మనం అర్పించే నివాళి అని కేటీఆర్ చెప్పారు. పేదల పక్షపాతి అయిన ఆయన ఆశయాలు నెర వేరాలంటే పార్టీ శ్రేణులు ఐకమత్యంగా ఎన్నికను ఎదుర్కొవాలని సూచించారు. ఆయన సతీమణి సునీతను అక్కున చేర్చుకొని ఆదరించాలని కోరారు. బేకారు పార్టీలైన కాంగ్రె స్, బీజేపీలకు ఓటుతో బుద్ధిచెప్పాలని సూచించారు. ఏమాత్రం అదమరిచినా అరిగోస పడాల్సి వస్తుందని పునరుద్ఘాటించారు. జూబ్లీహిల్స్ ఓటర్లు విజ్ఞతతో వ్యవహరించాలని విన్నవించారు.
అవినీతి సొమ్ము తీసుకోండి.. నీతివైపు నిలవండి..
కాంగ్రెస్ అక్రమంగా సంపాదిస్తున్న సొమ్ము తీసుకొని నీతివైపు నిలువాలని జూబ్లీహిల్స్ ఓటర్లకు కేటీఆర్ విజ్జప్తిచేశారు. ‘ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నేతల నుంచి ఓటుకు రూ. 5 వేలు ఇస్తామంటే డిమాండ్ చేసి పదివేలు తీసుకోండి..ప్రమాణాలు చేయిస్తే మనస్సులో దేవుడిపై ప్రమాణం చేసి బయటకు మాత్రం వారు చెప్పినట్లు చేయండి..మోసపూరిత పార్టీకి మోసంతోనే బుద్ధిచెప్పండి..’ అని పిలుపునిచ్చారు. వారు చెప్పే మాయమాటలు నమ్మితే మూడేళ్లు నరకం అనుభవించాల్సి వస్తుందనే విషయాన్ని గుర్తుచేసు కోవాల న్నారు. రెండు నెలలు బూత్‌స్థాయి బాధ్యులు, పార్టీ నేతలు, కార్యకర్తలు సమన్వయం తో ముందుకెళ్లాలని సూచించారు. కాంగ్రెస్ బెదిరింపులు, అక్రమ కేసులకు భయడవ ద్దని స్పష్టం చేశారు. కష్టపడ్డ వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.