Jubilee Hills By Elections | పటాన్ చెరు, అక్టోబర్ 25:జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. శనివారం జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలోని ఎర్రగడ్డలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, దివంగత నేత మాగంటి గోపీనాథ్ సతీమణి మాగంటి సునీత తరపున ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
జూబ్లీహిల్స్ నియోజకవర్గ పరిధిలోని 101 డివిజన్ ఎర్రగడ్డ 385 బూత్ పరిధిలో బూత్ ఇంచార్జిలు సందీప్ గిరి గోస్వామి తో కలిసి ప్రచారం నిర్వహించారు. ఏ ఇంటి తలుపు తట్టిన బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు ఆప్యాయంగా పలకరించి, ఇంటిలోనికి ఆహ్వానిస్తున్నారని మెట్టుకుమార్ యాదవ్ తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ రాష్ట్ర ప్రజలకు చేసిన మేలు తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నటికీ మరచిపోరని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ గెలుపును ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్డుకోలేరని స్పష్టం చేశారు.