చర్లపల్లి, నవంబర్ 24 : ఉప్పల్ నియోజకవర్గంలో కాలనీల సమగ్రాభివృద్ధికి కృషి చేయనున్నట్లు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఏఎస్‌రావునగర్ డివిజన్లోని పల్లె ప్యారడైజ్ ఫైవ్ ఎలిమెంట్స్ అపార్ట్మెంట్లో మాజీ కార్పొరేటర్లు కొత్త రామారావు, పజ్జూరి పావనీమణిపాల్రెడ్డితో కలిసి బండారి లక్ష్మారెడ్డి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కాలనీవాసులు లక్ష్మారెడ్డి తమ పూర్తి మద్దతు ప్రకటించారు. అనంతరం బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ ఉప్పల్ నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ కృషి చేశారని, తనను గెలిపిస్తే మరింత అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు.
బీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధి, సంక్షేమం, ఎన్నికల మెనిఫెస్టోకు అకర్షితులై వివిధ పార్టీలకు చెందిన నాయకులు, ప్రజలు బీఆర్ఎస్లో చెరుతున్నారని అన్నారు. ఉప్పల్‌లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని, కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజారిటీ అందించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కాసం మహిపాల్‌రెడ్డి, కుమారస్వామి, కాలనీ వర్కింగ్ ప్రెసిడెంట్ వరికుప్పల మల్లేశ్, స్థానికులు శ్రీధర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, రంగారెడ్డి, నవీన్‌రెడ్డి, ప్రభకుమార్, ధన్సాగర్రెడ్డి, శ్రీనివాస్ పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన భవానీనగర్ వాసులు
మల్లాపూర్ : ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వేలాదిమంది బీఆర్ఎస్లో చేరుతున్నారని ఆ పార్టీ ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మల్లాపూర్ డివిజన్ భవానీనగర్‌కు చెందిన రవిందర్‌యాదవ్ ఆధ్వర్యంలో పలువురు కాలనీవాసులు శుక్రవారం బండారి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి లక్ష్మారెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కార్యక్రమంలో కార్పొరేటర పన్నాల దేవేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
మైనార్టీలను ఓటు అభ్యర్థించిన కార్పొరేటర్
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం మీర్పేట్ హెచ్బీకాలని డివిజన్ పరిధిలోని మసీదుల వద్ద కార్పొరేటర్ జెర్రిపోతుల ప్రభుదాస్, తదితరులు ప్రచారం నిర్వహించారు.కారు గుర్తుకు ఓటు వేయాలని ముస్లిం సోదరులను అభ్యర్థించారు.
మీర్పేట్లో బీఆర్ఎస్ నాయకుల ప్రచారం..
మీర్పేట్ హెచ్‌బీకాలనీ డివిజన్ వెంకటేశ్వరనగర్‌లో కాలనీ బీఆర్ఎస్ ఇన్చార్జి బోదాసు రవి ఆధ్వర్యంలో బండారి లక్ష్మారెడ్డిని గెలిపించాలని నాయకులు ప్రచారం నిర్వహించారు. వ్యాపార సముదాయాల్లో బీఆర్ఎస్ కర పత్రాలను అందజేసి కారు గుర్తుకు ఓటు వేయాలని దుకాణదా రులను అభ్యర్థించారు. కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శ్రీపతి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు తిరునగిరి నవీన్‌కుమార్, కొమురన్న, వసంతరావు, మల్లేశ్‌యాదవ్, కృష్ణ, రాజేశ్, మల్లేశ్, తదితరులు పాల్గొన్నారు.
బండారికి ఉప్పల్ లారీ ఓనర్స్ అసోసియేషన్ మద్దతు
రామంతాపూర్ : బీఆర్ఎస్ నాయకుడు పాలకూర శ్రీకాంత్‌గౌడ్ ఆధ్వర్యంలో శుక్రవారం ఉప్పల్‌లో లారీ ఓనర్స్ అసోసియేషన్ సమావేశం జరిగింది. బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి, పార్టీ రాష్ట్ర నాయకుడు రాగిడి లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు బండారి లక్ష్మారెడ్డికి మద్దతు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానం చేసి ప్రతిని ఆయనకు అందజేశారు. అనంతరం బండారి మాట్లాడుతూ లారీ ఓనర్స్ అసోసియేషన్ సమస్యల పరిష్కారానికి తమ వంతుగా కృషి చేస్తానన్నారు. బండారి లక్ష్మారెడ్డిని వారు ఘనంగా సన్మాంచారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పసుల ప్రభాకర్‌రెడ్డి, గంధం నాగేశ్వర్రావు, సర్వబాబుయాదవ్, అసోసియేషన్ అధ్యక్షుడు ప్రతాప్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి బాలకిషన్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
రామంతాపూర్‌లో విస్తృత ప్రచారం
బండారి లక్ష్మారెడ్డిని ఎమ్మెల్యేగా గెలిపించాలని కోరుతూ మాజీ కార్పొరేటర్ గంధం జ్యోత్స్ననాగేశ్వర్రావు శుక్రవారం ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేశారు. కార్యక్రమంలో పలువురు బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు.
అభివృద్ధికి పట్టం కట్టండి..: కార్పొరేటర్ గీత
అభివృద్ధికి పట్టం కట్టండి.. అని చిలుకానగర్‌లో కార్పొరేటర్ గీత, బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం పలు కాలనీల్లో ఇంటింటి నిర్వహించారు. మైనార్టీ సోదరులకు నమూనా బ్యాలెట్ అందించి కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బన్నాల ప్రవీణ్, మాజీ కౌన్సిలర్ పల్లె రాజ్‌కుమార్‌గౌడ్, ఫారూఖ్, శ్రీనివాస్, రామాంజనేయులు, బాలకృష్ణ, ఆజాద్, సురేశ్ తదితరులు పాల్గొన్నారు.