రేవంత్రెడ్డి ప్రభుత్వం ఫార్మా సిటీ ఏర్పాటుకు వికారాబాద్ జిల్లాలో ఇటీవల భూసేకరణ చేపట్టింది. తమకు జీవనాధారం లేకుండా పోతున్నదని ఆందోళన చెందిన లగచర్ల గ్రామానికి చెందిన రైతులు ప్రభుత్వం నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణను అడ్డుకున్నారు. దీంతో భూసేకరణను వ్యతిరేకిస్తూ ఆందోళన చేసిన లగచర్ల రైతులపై కేసులు పెట్టి బేడీలు వేసి జైలులో వేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. పేద రైతులు బెయిల్ కోసం ఎంత శ్రమిస్తున్నా ఫలితం లేకుండా పోతుండటంతో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారికి అండగా నిలిచారు. కేటీఆర్ ఇచ్చిన పిలుపులో భాగంగా మంగళవారం బీఆర్ఎస్ శ్రేణులు లగచర్ల రైతులపై పెట్టిన కేసులు ఎత్తేయాలని అంబేద్కర్ విగ్రహాలకు వినతులు అందజేసి నిరసన తెలిపారు.