షేక్‌పేట్ అక్టోబర్ 17: బీఆర్ఎస్ పార్టీకి షేక్‌పేట్‌లో ప్రజల నుంచి ముఖ్యంగా మైనార్టీల నుంచి అనూహ్య స్పందన ఉందని,భారీ మెజార్టీని సాధించడం ఖాయం అని పార్టీ నాయకులు చెరక మహేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను మాయ మాటలతో మోసం చేసిందని, ఆరు గ్యారంటీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదని చెరక మహేష్ పేర్కొన్నారు.
దీంతో ప్రజలు కాంగ్రెస్ పార్టీపై తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్‌కు అన్నీ వర్గాల నాయకుడన్న పేరు ఉందని, ప్రతి ఒక్కరూ మాగంటి సునీతకు ఓటు వేసి గెలిపించాలన్న కసితో ఉన్నారని చెప్పారు.