Padma Rao Goud | మారేడ్పల్లి: నిరంతరం ప్రజల మధ్య ఉండే సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ అంటే ఒక బ్రాండ్ అని.. ఆయన గెలుపును ఎవ్వరూ ఆపలేరని ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం సనత్నగర్ నియోజకవర్గంలోని మోండా డివిజన్లో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ పాదయాత్ర చేసి..ఇంటింటి ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ….సికింద్రాబాద్ పార్లమెంటు స్థానంపై బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి చరిత్రను తిరుగరాస్తామన్నారు. బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావు గౌడ్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి, అభివృద్ధి ఎంతో కృషి చేసిందన్నారు. అంతకుముందు మోండా డివిజన్ బండిమెట్లో బీఆర్ఎస్ కార్యాలయాన్ని ఎంపీ అభ్యర్థి పద్మారావు, ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ రూప, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు హరికృష్ణ, నాయకులు నాగులు, తలసాని స్కైలాబ్ యాదవ్, తలసాని ధర్మేందర్ యాదవ్, రాములు, మహేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.