Dasoju sravan kumar | అందరిని జట్టు కట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత పార్టీది : ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్
Dasoju sravan kumar | పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరినీ కూడా జట్టు కట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత.. పార్టీ ఎవరినీ వదిలిపెట్టదు. దయచేసి ఏ రకమైన అభద్రతా భావానికి, సందేహానికి కానీ లోను కావొద్దని కోరుతున్నానన్నారు ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్.
Dasoju sravan kumar | తెలంగాణ భవన్లో ఖైరతాబాద్ నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశానికి బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, పార్టీకి చెందిన ముఖ్యనేతలు హాజరయ్యారు. ఈ సమావేశంలో ఎస్ఐఆర్, పార్టీ సభ్యత్వ నమోదు ప్రక్రియపై దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్ మాట్లాడుతూ.. ఇప్పుడు చాలా మందికి కొంత అపనమ్మకమో ,ఆలోచనో ఉండొచ్చు. లేకపోతే కొంతమంది పేర్లు వచ్చినయ్.. కొంతమందివి రాలేదని ఉండొచ్చు. మనం 6 డివిజన్ మీటింగ్స్ పెట్టుకున్నం.. డివిజన్ డివిజన్ మీటింగ్‌లో అందరికీ క్లియర్ ఒకటే మాట చెప్పినమన్నారు. కేవలం బీఎల్ ఎస్ అంటే ఎస్ ఐఆర్ కార్యక్రమానికి ఒక్కరినే ఇవ్వమని ఎన్నికల సంఘం చెప్పిందన్నారు.
మెంబర్షిప్ అప్లికేషన్లో కేవలం ఇద్దరినే ఇవ్వమన్నది కాబట్టి మాత్రమే ఏరి కోరి కొంత ఉత్సాహంగా పనిచేసేటోళ్లు, యువకులను గుర్తించారు. అంతమాత్రం చేత గుర్తింపబడని, లిస్టులో లేనటువంటి వాళ్లను విస్మరణకు గురిచేసినట్టు కాదు.. ఇది మరిచిపోండి. పనిచేయడానికి సిద్ధంగా ఉన్నవాళ్లందరినీ కూడా జట్టు కట్టి ముందుకు తీసుకుపోయే బాధ్యత.. పార్టీ ఎవరినీ వదిలిపెట్టదు. దయచేసి ఏ రకమైన అభద్రతా భావానికి, సందేహానికి కానీ లోను కావొద్దని కోరుతున్నానన్నారు.
ఇవాళ బీఆర్ ఎస్ పార్టీకి ఒక పరీక్షా సమయం. దేశంలో కూడా చాలా రాజకీయ పార్టీలున్నయి. తెలంగాణకు స్వాతంత్ర్యం తెచ్చిన పార్టీలో తెలంగాణ సమర యోధులం మనమందరం. దేశమంతా గర్వపడేలా పంజాబ్ రాష్ట్రాన్నో లేదా ఇతర రాష్ట్రాలను తలదన్నే రీతిలో మన నాయకుడి నేతృత్వంలో నంబర్ వన్ స్టేట్‌గా తీర్చిదిద్దబడ్డ పార్టీలో మనమున్నామన్నారు. మనమంతా బీఆర్ ఎస్‌లో భాగమైనందుకు గర్వపడాలి. మాది తెలంగాణ అని గర్వంగా చెప్పుకుంటామన్నారు.
Read also :
Towel Dance | ఫారెన్ రోడ్లపై యువతి టవల్ డ్యాన్స్.. భారతీయుల పరువు తీస్తున్నారని నెటిజన్ల ఫైర్
Ram Charan| రామ్ చరణ్‌కు సర్జరీ .. RC17 మరింత ఆలస్యం కానుందా, ఆందోళనలో మెగా ఫ్యాన్స్!
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
Palamuru Lift Inauguration | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలను ప్రారంభించిన మంత్రి జూపల్లి
పీఆర్టీయూ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షుడిగా వెల్లంకి నాగరాజు
Harish Rao | రేవంత్ రెడ్డి పాలమూరు ద్రోహి.. మళ్లీ ఈ జిల్లాలో వలసలు మొదలైనయి : హరీశ్ రావు
Palamuru Lift | ఫలించిన సింగిరెడ్డి వ్యూహం..ఎట్టకేలకు పాలమూరు లిఫ్ట్ ప్రారంభం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

