MLA Sudheer Reddy | మన్సురాబాద్, ఫిబ్రవరి 28 : బీసీ బాలికల వసతి గృహంలో నెలకొన్న సమస్యలను సత్వరమే పరిష్కరింపజేస్తానని ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దేవీరెడ్డి సుధీర్ రెడ్డి తెలిపారు. మన్సురాబాద్ డివిజన్ చిత్ర సినిమా కాలనీలోని బీసీ బాలికల వసతి గృహాన్ని శుక్రవారం ఆయన పరిశీలించి అక్కడ నెలకొన్న సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మాట్లాడుతూ.. రాబోయే వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని విద్యార్థులకు ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా ఉండేందుకుగాను చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. విద్యార్థులకు స్వచ్ఛమైన మంచినీటిని అందించాలనే లక్ష్యంతో ముందస్తుగా బీసీ హాస్టల్కు వాటర్ ప్యూరిఫైడ్ను అందజేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు త్వరలో జరగబోయే వార్షిక పరీక్షలకు సిద్ధమై మంచి ఫలితాలను రాబట్టాలని సూచించారు. హాస్టల్లో ఎలాంటి సమస్యలు ఎదురైన వాటిని తన దృష్టికి తీసుకురావాలని.. యుద్ధ ప్రాతిపదికన వాటిని పరిష్కరింపజేస్తానన్నారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్ రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, నాయకులు పోచబోయిన జగదీష్ యాదవ్, టంగుటూరి నాగరాజు, జక్కిడి రఘువీర్ రెడ్డి, సూరజ్ యజ్దని, విజయ భాస్కర్ రెడ్డి, సిద్ధగొని జగదీష్ గౌడ్, ఆనంద్, హాస్టల్ సిబ్బంది రమేష్, సంధ్య, విఠల్ తదితరులు పాల్గొన్నారు.