MLA Sabitha | ప్రజా సమస్యల పట్ల నిర్లక్ష్యమా? అధికారుల తీరుపై ఎమ్మెల్యే సబిత తీవ్ర అసహనం
MLA Sabitha | మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మామిడిపల్లి, మల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
MLA Sabitha | బడంగ్పేట్, జూలై 15 : మహేశ్వరం నియోజకవర్గంలోని బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని గుర్రంగూడ, మామిడిపల్లి, మల్లాపూర్లో జరుగుతున్న అభివృద్ధి పనులపై మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి సబితా ఇంద్రారెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులపై అధికారులను నిలదీశారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధికారుల నుంచి స్పందన లేకపోవడంపై ఆమె తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, పనులు నత్తనడకన సాగడం ఏమిటని ప్రశ్నించారు. అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చురకలు పెట్టారు. డ్రైనేజీ వ్యవస్థ, సిసి రోడ్లు, స్ట్రీట్ లైట్స్, మంచినీటి సరఫరా, ఎస్ఎన్డీపీ నాలా వంటి కీలక అంశాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలన్నారు. నాణ్యత ప్రమాణాలను పాటించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పమన్నారు. నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయని ఆమె మండిపడ్డారు. అసంపూర్తిగా ఉన్న పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
స్థానిక ఎన్నికలు పెట్టడానికి ప్రభుత్వం భయపడుతోంది…
స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టకపోవడం వల్లనే పాలన వ్యవస్థలు అనేక సమస్యలు ఉత్పన్న అవుతున్నాయని ఎమ్మెల్యే అన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఉంటే త్వరగా సమస్యలు పరిష్కరించడానికి అవకాశం ఉంటుందన్నారు. డ్రైనేజీ, స్ట్రీట్ లైట్ ల సమస్యను పరిష్కరించలేని స్థితిలో మున్సిపల్ ఉందని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. కాలనీల నుంచి అనేక సమస్యలు వస్తున్నాయని ఆమె పేర్కొన్నారు. కమిషనర్ ప్రత్యేక అధికారిపై ఆధారపడితే ప్రత్యేక అధికారి ఎప్పుడు వస్తారు ఎప్పుడు పోతారు ఎవరికి తెలియదన్నారు. ఎమర్జెన్సీ పనుల కోసం అనుమతి ఎవరు నుంచి తీసుకోవాలో తెలియని పరిస్థితి ఏర్పడిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.
మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేయకూడదు
నగర శివారు ప్రాంతాలలో ఉన్న మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను గ్రేటర్ లో విలీనం చేసే ప్రతిపాదనను ప్రభుత్వం విరమించుకోవాలన్నారు. శివారు మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలపడం వలన ప్రజల మౌలిక సమస్యల పరిష్కారానికి ఇబ్బంది అవుతుందన్నారు. మున్సిపాలిటీలను గ్రేటర్ లో కలపాలని ఎవరిని అడగాలో తెలియదన్నారు. ఇప్పటివరకు మున్సిపల్ శాఖ మంత్రి లేకపోవడం వలన మున్సిపాలిటీలలో సమస్యలు పేరుకుపోతున్నాయని అన్నారు. ముఖ్యమంత్రి దగ్గరనే మున్సిపల్ శాఖ మంత్రి ఉండటం వలన సమస్యలు చర్చించడానికి వీలు లేకుండా పోయిందన్నారు. ముఖ్యమంత్రి సమయం ఇస్తారో ఎవరో తెలియదన్నారు. మున్సిపాలిటీలను గ్రేటాల్లో కలుపుతారు, ఎన్నికలు నిర్వహిస్తారు తెలియని అయోమయ పరిస్థితి నెలకొన్నది అన్నారు.
ఈ సమీక్ష సమావేశంలో మున్సిపల్ కమిషనర్ సరస్వతి, డిఈ వెంకన్న, మేనేజర్ నాగేశ్వరరావు, ఆర్వో వేణుగోపాల్ రెడ్డి, ఏఈ హరీష్, ఏవో అరుణ, టీపీవో కిరణ్, వర్క్ ఇన్స్పెక్టర్లు , రాకేష్, వినయ్ ,కళ్యాణ్, యాదగిరి యాదగిరి, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
‘పట్టభద్రులు ఓటు హక్కు నమోదు చేసుకోవాలి’
‘అర్హులైన మహిళలందరికీ బతుకమ్మ చీరలు ఇవ్వాలి’
Congress councilors resign | మంత్రి జూపల్లి, ఎంపీ మల్లు రవి పోకడలకు నిరసనగా ఏడుగురు కాంగ్రెస్ కౌన్సిలర్ల రాజీనామా
Blue Drum Murder | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. నిందితులు ముస్కాన్, సాహిల్కు మరణశిక్ష
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

