MLA Padma Rao Goud | హైదరాబాద్ : సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. ఉత్తరాఖండ్ రాజధాని డెహ్రాడూన్ పర్యటనలో ఉన్న పద్మారావుకు మంగళవారం మధ్యాహ్నం గుండెపోటు వచ్చింది. దీంతో అప్రమత్తమైన కుటుంబ సభ్యులు, సిబ్బంది.. ఆయనను హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తక్షణమే స్పందించిన వైద్యులు.. పద్మారావు గౌడ్‌కు స్టంట్ వేశారు. ప్రాణాపాయం లేదని వైద్యులు స్పష్టం చేశారు. ఈ రాత్రికి పద్మారావు సికింద్రాబాద్ చేరుకోనున్నట్లు సమాచారం.
ఇవి కూడా చదవండి..
KTR | సమస్యలకు కేరాఫ్‌గా హైదరాబాద్ నగరం.. కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ కేటీఆర్