MLA Lakshma Reddy | రామంతపూర్, మార్చి 8 : హబ్సిగూడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రామంతపూర్ ఎస్వీఎం గ్రాండ్లో శనివారం జరిగిన మహిళా దినోత్సవ వేడుకలలో ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ స్త్రీలు అన్ని రంగాల్లో రాణించాలని, విద్యార్థినులు ఇష్టంతో విద్యను అభ్యసిస్తే ఉన్నత శిఖరాలను చేరుకుంటారని అన్నారు. డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో మహిళలకు సమాన హక్కులు కల్పించారని అన్నారు. మహిళలందరూ పురుషులతో పోటీ పడుతూ అన్ని రంగాలలో ముందుకు సాగాలని ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.
మల్కాజ్గిరి పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జి రాగిడి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. మహిళా సంక్షేమం కోసం గత ప్రభుత్వం అన్ని విధాల కృషి చేసిందన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర నాయకులు పసుల ప్రభాకర్ రెడ్డి, మాజీ డివిజన్ అధ్యక్షులు డాక్టర్ బి.వి చారి, మాజీ ప్రధాన కార్యదర్శి సోమిరెడ్డి, లక్ష్మి నారాయణ, కైలాష్ పాతి గౌడ్, యాదయ్య, మహిళ సోదరీమణులు సరిత గౌడ్, మాజీ అధ్యక్షురాలు యాదమ్మ, రజిత రెడ్డి, కల్పన రెడ్డి, లక్ష్మి, పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.