MLA Kaleru Venkatesh | అంబర్‌పేట, జూన్ 20 : బాగ్ అంబర్‌పేట డివిజన్ వైభవ్ నగర్లో సుందరీకరించిన పార్కును త్వరలోనే ప్రారంభిస్తామని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. బాగ్ అంబర్‌పేట కార్పొరేటర్ బి. పద్మా వెంకట్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే శుక్రవారం డివిజన్లోని వైభవ్ నగర్ పార్క్‌ను సందర్శించి పనులను పరిశీలించారు. పార్క్ ఇప్పటికే తుది దశలో ఉందని, రాబోయే కొన్ని రోజుల్లో ప్రారంభోత్సవానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిపారు. మిగిలిన పనులు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఏఈ మనీషా, వర్క్ ఇన్స్పెక్టర్ రవి, కాలనీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.