MLA Kaleru Venkatesh | కాచిగూడ, జూన్ 15 : విద్యార్థులలో దాగి ఉన్న నైపుణ్యతనే ఉన్నత శిఖరాలకు చేరుకోవడానికి దోహదపడుతుందని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అన్నారు. భావసార్ క్షత్రియ గ్రాడ్యుయేట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 49వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని 7 నుంచి 10 పదవ తరగతిలో మెరిట్ మార్కులు సాధించిన 400 మంది పేద విద్యార్థులకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ నోట్ బుక్స్, బ్యాగులతోపాటు స్టేషనరీని భావాస్కర్ భవన్ కమ్యూనిటీ హాల్లో పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలేరు హాజరై మాట్లాడుతూ.. విద్యార్థులు విద్యారంగానికి కీలకమైన వారధులని ఆయన పేర్కొన్నారు. విద్యకు మద్దతు ఇచ్చే సంస్థలు సమాజాభివృద్ధికి మూల స్తంభాలుగా నిలుస్తాయని పేర్కొన్నారు. విద్యార్థులు కేవలం చదువులోనే కాకుండా ఇతర రంగాలపై దృష్టి సారించి ముందడుగు వేసినప్పుడే సమాజంలో మంచి గుర్తింపు ఉంటుందని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఉమేష్ జిటానే, అమర్ నాథ్, అశ్విన్ పటాంగే, కృష్ణ తండ్లే, మధుసూదన్, సత్యనారాయణ, రాజేశ్వర్, వినోద్, తదితరులు పాల్గొన్నారు.