పటాన్చెరు, సెప్టెంబర్ 2: కాంగ్రెస్, బీజేపీలు కుట్రతోని కాళేశ్వరం ప్రాజెక్టుపై సీబీఐ విచారణకు ఆదేశించారని పటాన్చెరు బీఆర్ఎస్ (BRS) ఇన్చార్జ్ ఆదర్శ్ రెడ్డి ఆరోపించారు. పటాన్చెరు పట్టణంలోని అంబేద్కర్ విగ్రహం ముందు బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూతికి నల్ల బట్టలు కట్టుకుని నిరసన చేపట్టారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుని మూసివేసేందుకు కుట్ర చేస్తుందని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కనుసైగలో సీఎం రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టును మూసివేయడంతో పాటు కేసీఆర్, హరీశ్ రావుపై కుట్రతోనే సీబీఐ విచారణకు ఆదేశించారన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అన్ని వర్గాల సంక్షేమం కోసం పనిచేస్తుండని తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలు అమలు చేయకుండా కాళేశ్వరం ప్రాజెక్టుపై కుట్రలు చేసి బద్నాం చేస్తుందన్నారు. బనకచర్లను నిర్మాణం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నం చేస్తే రేవంత్ రెడ్డి సహకరిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ నీటి వనరులను సంరక్షించకుండా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, బీఆర్ఎస్ నాయకులు బాల్ రెడ్డి, గోవర్ధన్ రెడ్డి, అంజయ్య, వెంకటేశం గౌడ్, ఐలాపూర్ మాణిక్ యాదవ్ తో పాటు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.