Talasani Shankar Yadav | హైదరాబాద్ : సికింద్రాబాద్‌లోని ఎస్వీఐటీ ఆడిటోరియంలో తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడు తలసాని శంకర్ యాదవ్ దశదిన కర్మ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కేటీఆర్, హరీశ్‌రావు, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ప్రకాశ్ గౌడ్. మల్లారెడ్డితో పాటు పలువురు నాయకులు హాజరై శంకర్ యాదవ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా తలసాని శ్రీనివాస్ యాదవ్ కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రగాఢ సానుభూతి ప్రకటించారు.