వెంగళరావునగర్, మార్చి 11: ఎమ్మెల్సీ కవితను అగౌరపర్చేలా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్‌కు మతి తప్పిందని.. అతన్ని ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పిస్తామని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. శనివారం రహ్మత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్ కూడలి వద్ద ఎమ్మెల్యే ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరస కార్యక్రమం చేపట్టారు. అనంతరం బండి దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మహిళలంటే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు గౌరవం లేదని..అతనికి పిచ్చిపట్టిందని.. ఎర్రగడ్డ మెంటల్ ఆసుపత్రిలో చేర్పించి తామే చికిత్స చేయిస్తామని అన్నారు. ఆడపడుచు కవిత పట్ల బండి సంజయ్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేస్తే తెలంగాణ సమాజం చూస్తూ ఊరుకోదని..మహిళాలోకం బండికి తగిన బుద్ధిచెబుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ సీ.ఎన్.రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షుడు మన్సూర్, మహిళా అధ్యక్షురాలు ధనుజ, స్రవంతి, రమాదేవి, నజీర్, జబ్బార్, నాగరాజు, లింగ మూర్తి తదితరులు పాల్గొన్నారు.
షేక్‌పేట్‌లో
మహిళలను కించపరచే విధంగా మాట్లాడటం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు తగదని బీఆర్ఎస్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు ,జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నారు. ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బండి సంజయ్ దిష్టి బొమ్మను శనివారం రాత్రి జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్‌పేట్‌లో రెండు వేల మంది మహిళలతో కలిసి దహనం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బండి సంజయ్‌కి పిచ్చి పట్టిందని, ఎప్పుడు ఏం మాట్లాడుతున్నాడో అర్థం కావడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వ బెదిరింపులకు సీఎం కేసీఆర్ భయపడరని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ప్రదీప్‌కుమార్,ప్రధాన కార్యదర్శి షకీల్‌అహ్మద్, మహిళా అధ్యక్షురాలు పార్వతి, నాయకులు రాము, రమేశ్, లత, సరస్వతి, రఫియా, ధనలక్ష్మి, మెహరున్నిసా, హేమలత,బాలకృష్ణ, వేణు తదితరులు పాల్గొన్నారు.
బండికి మతిభ్రమించింది ఎమ్మెల్యే కేపీ వివేకానంద్
Ban
జీడిమెట్ల, మార్చి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పాలని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ డిమాండ్ చేశారు. శనివారం సాయంత్రం ఐడీపీఎల్ చౌరస్తాలో ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా బండి సంజయ్‌కి, బీజేపీకి వ్యతిరేకంగా మహిళలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అనంతరం బండి సంజయ్‌ని అరెస్టు చేయాలని మహిళలు జీడిమెట్ల పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. బీజేపీకి రాష్ట్రంలో రోజు రోజుకూ అదరణ తగ్గడంతో తట్టుకోలేక బండి సంజయ్ మతిభ్రమించి రెచ్చగోట్టె వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. క్షమాపణ చెప్పకుంటే సంజయ్ ఇంటిని ముట్టడిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు.
అభివృద్ధిని చూసి బీజేపీ విషం కక్కుతుంది ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్
Fire
కాచిగూడ,మార్చి 11: తెలంగాణ అభివృద్ధి చూసి ఒర్వలేక బీజేపీ పార్టీ విషం కక్కుతుందని అంబర్‌పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆరోపించారు. ఎమ్మెల్సీ కవితపై బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ ఆధ్వర్యంలో శనివారం కాచిగూడ లింగంపల్లి చౌరస్తాలో వేలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలతో బండి సంజయ్ దిష్టి బొమ్మను తగలుబెట్టారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయంగా ఎదుగుతున్న ఎమ్మెల్సీ కవితను ఎదుర్కొనలేకనే మోదీ ప్రభుత్వం, బీజేపీ నాయకులు బండి సంజయ్ చిల్లర రాజకీయలు చేస్తున్నారని ఆరోపించారు.కవితకు భేషరతుగా సంజయ్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ విజయ్‌కుమార్ గౌడ్, మాజీ ప్లోర్‌లీడర్ దిడ్డి రాంబాబు, బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు, నాయకులు సునీల్బిడ్లాన్, ఎర్ర భీష్మాదేవ్, డాక్టర్ శిరీషాయాదవ్, ఓం ప్రకాశ్‌యాదవ్, బి.కృష్టాగౌడ్, ధాత్రిక్ నాగేందర్బాబ్జి, విజితారెడ్డి, కె.సదానంద్, మన్నె శ్రీనివాస్‌యాదవ్, మహేశ్‌కుమార్,శేషు, శ్రీకాంత్‌యాదవ్, బబ్లూ, అంటోని, పాల్గొన్నారు.
బండి వ్యాఖ్యలపై భగ్గుమన్న బీఆర్ఎస్
బంజారాహిల్స్,మార్చి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఖైరతాబాద్ నియోజకవర్గం బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లకు చెందిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా పంజాగుట్ట చౌరస్తావద్ద ఆందోళన కార్యక్రమానికి తరలివచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో పంజాగుట్ట చౌరస్తాలో ధర్నా నిర్వహించడంతో పాటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మ దహనం చేశారు. బీజేపీకి, బండి సంజయ్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మహిళ అని చూడకుండా బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు యావత్తు తెలంగాణ సమాజాన్ని సిగ్గుతో తలదించుకునేలా చేస్తున్నాయని వారు బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మన్నె కవితారెడ్డి, వనం సంగీతాయాదవ్ అన్నారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్ కార్పొరేటర్ వెల్దండ వెంకటేశ్, నాయకులు మామిడి నర్సింగరావు, అరుణ్‌కుమార్. నగేశ్సాగర్, వనం శ్రీనివాస్ యాదవ్, రాములు చౌహాన్, తిరుమలేశ్ నాయుడు, షేక్ అహ్మద్, మాధవి యెండూరి, సుధాకర్‌రెడ్డి పాల్గొన్నారు.
బంజారాహిల్స్‌లో దిష్టి బొమ్మ దహనం..
బంజారాహిల్స్.మార్చి 11: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను ఉద్దేశించి బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా బంజారాహిల్స్ రోడ్ నెం 12లో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆందోళన కార్యక్రమంలో నగర మేయర్ గద్వాల్ విజయలక్ష్మితో పాటు పలువురు కార్పొరేటర్లు, మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ దిష్టి బొమ్మను కార్పొరేటర్లు దహనం చేశారు. అనంతరం బీఆర్ఎస్ కార్యకర్తలు బండి సంజయ్ ఫోటోను గాడిదపై ఊరేగించారు.
బీజేపీకి మహిళలను గౌరవించడం తెలియదు
నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి
Ban
అడ్డగుట్ట, మార్చి 11 : ఎమ్మెల్సీ కవితపై అనుచిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ భేషరతుగా క్షమాపణలను చెప్పాలని నగర డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత శోభన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ కవిత పట్ల అనుచితంగా మాట్లాడిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ వ్యాఖ్యలకు నిరసనగా శుక్రవారం చిలకలగూడ చౌరస్తాలో సికింద్రాబాద్ బీఆర్ఎస్ ఆధ్వర్యంలో డిప్యూటీ మేయర్, సికింద్రాబాద్ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ శ్రేణులు బండి సంజయ్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ.. బండి సంజయ్ వ్యాఖ్యలు తన అహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. హిందుత్వం, భారతీయ సాంస్కృతి అని పదేపదే చెప్పుకుంటూ తిరిగే బీజేపీ పార్టీకి మహిళలను గౌరవించడం కూడా రాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ చేస్తున్న చిల్లర రాజకీయాలను ప్రజలు గమనిస్తునే ఉన్నారని, రానున్నకాలంలో ప్రజలు ఓట్లతోనే బుద్ధిచెప్పుతారని ఆమె స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అడ్డగుట్ట, మెట్టుగూడ, సీతాఫల్మండి, బౌద్ధనగర్ కార్పొరేటర్లు లక్ష్మీ ప్రసన్న, రాసూరి సునీత, సామల హేమ, కంది శైలజతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు.