జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ప్రక్రియ సజావుగా జరిగేలా చూడాలని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డిని మాజీ మంత్రి హరీశ్‌రావు సహా బీఆర్ఎస్ నాయకులు కోరారు. ఈ మేరకు హైదరాబాద్ బీఆర్కే భవన్లో సీఈవోను కలిసి కాంగ్రెస్ పార్టీపై ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించి డబ్బులు పంపిణీ చేస్తున్నారని ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లారు.
సీఈవో సుదర్శన్ రెడ్డిని కలిసిన వారిలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, కొప్పుల ఈశ్వర్, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సోమ భరత్ కుమార్, బీఆర్ఎస్ నాయకులు కిశోర్ గౌడ్, అల్లీపురం వెంకటేశ్వరరెడ్డి తదితరులు ఉన్నారు.