MLA Arikepudi Gandhi | ‘నియోజకవర్గానికి శనిలా దాపురించిన ఎమ్మెల్యే గాంధీ.. ప్రశ్నిస్తే అక్రమ కేసులు’
MLA Arikepudi Gandhi | శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు మారబోయిన రవి యాదవ్పై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మియాపూర్ పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు.
MLA Arikepudi Gandhi | మియాపూర్ , ఏప్రిల్ 5 : బీఆర్ఎస్ బీ ఫాంపై గెలిచిన ఎమ్మెల్యే గాంధీ ఆ పార్టీ శ్రేణులపై కేసులు నమోదు చేయిస్తున్నారని నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ మారి ఏ పార్టీలో ఉన్నాడో చెప్పుకోలేని దుస్థితిలో ఉన్నారని, నియోజకవర్గంలో పడకేసిన అభివృద్ధిపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ శ్రేణులపై అక్రమంగా కేసులు బనాయిస్తూ అణచివేతకు యత్నిస్తున్నారని.. అయినా కేసులకు భయపడేది లేదని వెనకడుగు వేసేది లేదని స్పష్టం చేశారు. ప్రజల కోసం తమ పోరాటం నిరాటంకంగా కొనసాగిస్తామన్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ యువజన నాయకుడు మారబోయిన రవి యాదవ్పై మియాపూర్ పోలీసులు అక్రమ కేసులు నమోదు చేయటాన్ని నిరసిస్తూ ఆయనకు మద్దతుగా నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆదివారం మియాపూర్ పోలీస్ స్టేషన్కు పెద్ద ఎత్తున చేరుకుని ఆందోళన చేపట్టారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రవీందర్ మాట్లాడుతూ.. నియోజకవర్గానికి ఎమ్మెల్యే గాంధీ శనిలా దాపురించారని, తన స్వలాభం కోసం పార్టీ మారారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా నియోజకవర్గంలో అభివృద్ధి పూర్తిగా పడకేసిందని, ప్రజల తరపున బీఆర్ఎస్ అభివృద్ధికై పోరాడుతుండగా.. ఎమ్మెల్యే అక్రమంగా కేసులు పెట్టిస్తూ అణచివేయాలని చూస్తున్నారని అది అసాధ్యమని రవీందర్ అన్నారు. ప్రజా సమస్యలపై తమ పోరాటం ఆగదని కేసులకు బయపడి వెనకడుగు వేసేదిలేదన్నారు.
రాబోయే కార్పొరేషన్ ఎన్నికలలో 24 సీట్లను గెలిచి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఎప్పటికయినా ప్రజలకు అండగా నిలిచేది గులాబీ జెండాయేనని స్పష్టం చేశారు. తనపై నమోదు చేసిన కేసులకు సంబంధించి 8వ తేదీన పోలీసు విచారణకు హాజరవుతానన్నారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గవ్యాప్త బీఆర్ఎస్ పార్టీ నేతలు, శ్రేణులు, మహిళా నేతలు కార్యకర్తలు పాల్గొన్నారు. ఎమ్మెల్యే గాంధీని కించపరిచే విధంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారనే ఫిర్యాదుపై మియాపూర్ మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ ఫిరాదు మేరకు కేసు నమోదు చేసి రవియాదవ్కు నోటీసులు ఇచ్చినట్లు మియాపూర్ సీఐ శివప్రసాద్ తెలిపారు.
Read Also :
Shah Rukh Khan | కింగ్ ఖాన్ హాలీవుడ్ ఎంట్రీ?.. ‘ది వైట్ లోటస్’ వెబ్ సిరీస్లో షారూఖ్.!
Watch: పొలంలో కూలిన యూఏవీ.. తర్వాత ఏం జరిగిందంటే?
Sara Arjun | 1300 మందిని ఆడిషన్స్ చేశారట.. ధురంధర్లో సారా అర్జున్ ఎలా ఫైనల్ అయిందంటే..?
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

