Mynampally Hanumanth Rao | కాంగ్రెస్ నాయకుడు మైనంపల్లి హన్మంతరావు అనుచరుల అరాచకాలపై బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. మైనంపల్లి అనుచరులు సోషల్మీడియాలో మహిళలను కించపరిచేవిధంగా పోస్టుల పెడుతున్నారని ఫిర్యాదు చేశారు.
అనంతరం బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి అనుచరులు తమపై దాడి చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన వీడియోలు పోస్ట్ చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని తెలిపారు. ఫిర్యాదు చేసిన వారిలో గౌతమ్ నగర్ డివిజన్ కార్పొరేటర్ సునీతా యాదవ్, అల్వాల్ డివిజన్ కార్పొరేటర్ చింతల శాంతి శ్రీనివాస్ రెడ్డి, వెంకటాపురం డివిజన్ కార్పొరేటర్ సబితా కిశోర్, ఇతర బీఆర్ఎస్ నేతలు ఉన్నారు.
మైనంపల్లిపై మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు
మైనంపల్లి అనుచరులు సోషల్ మీడియా లో మహిళలను కించపరిచే విధంగా పోస్టులు పెడుతున్నరంటూ మానవ హక్కుల కమిషన్ ని ఆశ్రయించిన బీఆర్ఎస్ మహిళా కార్పొరేటర్లు
తమపై దాడి చేయడమే కాకుండా.. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పార్టీకి చెందిన మైనంపల్లి అనుచరులు… pic.twitter.com/wJtIdPjqoK
— BRS Party (@BRSparty) August 1, 2025