హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ కొనసాగుతున్నది. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత (Maganti Sunitha) ఓటువేశారు. ఎల్లారెడ్డి గూడ శ్రీకృష్ణ దేవరాయ వెల్ఫేర్ సెంటర్ బూత్ నంబర్ 290లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ప్రజలంతా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు.
కాగా, సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మొత్తం 4,01,365 ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. వీరి కోసం 407 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వెబ్‌కాస్టింగ్ ద్వారా జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. తొలిసారిగా డ్రోన్ల ద్వారా పోలింగ్‌ను పర్యవేక్షిస్తున్నారు. 139 ప్రాంతాల్లో డ్రోన్లతో పటిష్ట నిఘా ఏర్పాటు చేశారు. ఈ నెల 14న ఫలితాలు వెలువడనున్నాయి.