బంజారాహిల్స్,నవంబర్ 3: కష్ట సుఖాల్లో తోడుగా ఉంటూ చివరి శ్వాస వరకు జూబ్లీహిల్స్ ప్రజలతోనే ఉన్న దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ బాటలో పయనిస్తానని, రానున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో తనను గెలిపించాలని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ కోరారు. రహ్మత్‌నగర్ డివిజన్ పరిధిలోని శ్రీరాంనగర్, గంగానగర్ బస్తీల్లో మాగంటి సునీతాగోపీనాథ్ సోమవారం ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జూబ్లీహిల్స్ ప్రజల ఆశీర్వాదంతో మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ చూపిన బాటలోనే నడుస్తూ తాను కూడా నియోజకవర ్గప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని సునీతాగోపీనాథ్ తెలిపారు.