మారేడ్‌పల్లి, అక్టోబర్ 29: ప్రజా సంక్షేమం, అభివృద్ధి కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుందని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందిత అన్నారు. కంటోన్మెంట్ నియోజకవర్గం మోండా డివిజన్ రెజిమెంటల్బ జార్, పరికిబస్తీ, చీపురు బస్తీలో బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్షన్ సభ్యుడు నర్సింహ ముదిరాజ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి బీఆర్ఎస్ అభ్యర్థి లాస్య నందిత ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరుగుతూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులను వివరిస్తూ…ప్రచారంలో ముందుకు సాగారు. ఈ సందర్భంగా అభ్యర్థి లాస్యనందితకు ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. బీఆర్ఎస్ శ్రేణులు మొదటగా లాస్యనందితకు గులాబీ తలపాగాను బహూకరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. డప్పు దరువులతో ప్రచారం హోరెత్తించారు. జై కేసీఆర్…జై జై కేసీఆర్, జోహార్ సాయన్న అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మిన్నంటాయి.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందిత మాట్లాడుతూ…..రాష్ట్ర ప్రజల గురించి ఆలోచించే పార్టీ బీఆర్ఎస్ అని, సీఎం కేసీఆర్‌కు మద్దతు పలుకాలని అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఆశీర్వాదంతో అసెంబ్లీ ఎన్నికల్లో బరిలో నిలుస్తున్న తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. సీఎం కేసీఆర్ ప్రజా మ్యాఫెస్టోను ప్రకటించిన తర్వాత వార్ వన్ సైడ్‌గా మారిందన్నారు. మహిళా సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందన్నారు. ప్రజలందరూ సీఎం కేసీఆర్‌కు సంపూర్ణ మద్దతు పలుకుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ అంటే మాటల పార్టీ కాదని, చేతల ప్రభుత్వం అని అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్ని నెరవేర్చే దమ్ము, ధైర్యం గులాబీ పార్టీకే సొంతమన్నారు. సాయన్న చేసిన అభివృద్ధి పనులే తనను గెలిపిస్తాయని అభ్యర్థి లాస్యనందిత ధీమా వ్యక్తం చేశారు.
లాస్యనందితకు అండగా లబ్ధిదారులు
రెజిమెంటల్‌బజార్‌లో ఎన్నికల ప్రచారంలో భాగం గా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి లాస్యనందితకు బీఆర్ఎస్ ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులు తమ సంపూర్ణ మద్దతు పలికారు. డబుల్ బెడ్ రూం ఇండ్లు, పెన్షన్, బీసీ బంధు, మైనార్టీ బంధు లబ్ధిదారులందరూ స్వచ్ఛ ందంగా ముందుకు వచ్చి ఎన్నికల ప్రచారంలో పాల్గొని కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరా రు. ఈ సందర్భంగా లాస్యనందిత ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్ధిదారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ఆకుల రూప, జీహెచ్ఎంసీ మాజీ కో ఆప్ష న్ సభ్యుడు నర్సింహ ముదిరాజ్, బోయిన్పల్లి మార్కెట్‌కమిటీ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, బీఆర్ఎస్ నాయకులు ఆకుల హరికృష్ణ, నివేదిత, అశోక్ ముదిరాజ్, చిన్నా, సందీప్, సుజన్ ముదిరాజ్, శేఖర్ ముదిరాజ్, ఝాన్సీ, రాంపల్లి గోపి, రాంమోహన్, నారాయణ, కుమారి, కిష్ట్రఫర్, సురేశ్, చిత్రలేఖ, సాయి, రాము, అనిత, సంతోష్, కసిరెడ్డి నరేందర్‌రెడ్డి, సూరి, రఘు పాల్గొన్నారు.