చార్మినార్ : హైద్రాబాద్ నగర అందాలు చార్మినార్ పరిసరాల్లోనే దాగున్నాయని బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ డాక్టర్ ఆండ్రూ ప్లెమింగ్ అభిప్రాయపడ్డారు.ఆదివారం ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి చారిత్రక చార్మినార్, మక్కా మసీదు, మదీనా సమీపంలోని బాదేషాహి అషూర్ఖానాలను సందర్శించారు.
ఈ సందర్భంగా చారిత్రక కట్టడాలతోపాటు ఘన చరిత్ర కలిగిన కట్టడాలు పాతనగరంలోనే ఉన్నాయని అభిప్రాయపడ్డారు. అభివృద్ది చెందుతున్న నగరంతోపాటు ఓల్డ్‌సిటీ సైతం పోటీపడుతుందన్నారు. బ్రిటీష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ప్లెమింగ్ పర్యటన నేపధ్యంలో చార్మినార్, హుస్సేనిఆలం పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేశారు.
పర్యటనలో భాగంగా ఆయన చార్మినార్ సమీపంలోని ఓ హోటల్లో ఇరానీ ఛాయ్ టేస్ట్‌ను ఆస్వాదించారు.