జవహర్నగర్, నవంబర్ 8: విద్యుదాఘాతంతో ఓ బాలుడు మృతిచెందాడు. ఈ సంఘటన జవహర్నగర్ పోలీస్ష్టేషన్ పరిధి ప్రగతినగర్లో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జవహర్నగర్ కార్పొరేషన్లోని ప్రగతినగర్ కాలనీలో శానమ్మ కుమారుడు వరుణ్(7)తో కలిసి నివాసముంటున్నది.
వరుణ్ దేవేందర్నగర్లోని ప్రభుత్వ పాఠశాలలో 2వ తరగతి చదువుతున్నాడు. స్కూలు నుంచి ఇంటికి వచ్చిన వరుణ్ టీవీ చూస్తూ..మంచంలో పడుకున్నాడు. ప్రమాదవశాత్తు తీగలు తెగిపడి విద్యుదాఘాతంతో మంటలు అంటుకొని చనిపోయాడు. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని గాంధీ దవాఖానాకు తరలించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.