హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి (Shamshabad Airport ) బాంబు బెదిరింపు రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. శంషాబాద్ నుంచి టేకాఫ్ అయ్యే విమానంలో బాంబు(Bomb Threat) ఉందని, టేకాఫ్ అయ్యే సమయంలో పేలవచ్చు అంటూ దుండగుడు మెయిల్ చేశాడు.
దీంతో అధికారులు వెంటనే అప్రమత్తమై అత్యవసర చర్యలు చేపట్టారు. ఎలాంటి బాబు లేదని తేలడంతో
అంతా ఊపిరి పీల్చుకున్నారు. కాగా, గతంలోను కొంత మంది పోకిరీలు ఎయిర్పోర్ట్లో బాంబు ఉందంటూ బెదిరింపు కాల్స్ చేసిన విషయం తెలిసిందే.