హైదరాబాద్: హైదరాబాద్‌లోని నాంపల్లి కోర్టుకు (Nampally Court) బాంబు బెదిరింపు (Bomb Threat) కలకలం సృష్టించింది. బాంబు బెదిరింపుతో కోర్టు సిబ్బంది, న్యాయవాదులు, కక్షిదారులు భయాందోళనకు గురయ్యారు. అప్రమత్తమైన పోలీసులు కోర్టును తమ ఆధీనంలోకి తీసుకున్నారు. కోర్టులో ఉన్నవారిని బయటకు పంపారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో కలిసి తనిఖీ చేస్తున్నారు. ఎవరూ లోపలికి రాకుండా ప్రవేశ ద్వారాలను మూసివేశారు. బెదిరింపు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవరు చేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.