కొత్తగూడెం ప్రగతిమైదాన్, డిసెంబర్ 3: భద్రాద్రి కొత్తగూడెం రైల్వేస్టేషన్ ఆవరణలో నాటుబాంబు పేలి ఓ శునకం మృతిచెందింది. ట్రాక్ సమీపం నుంచి ఊర కుక్కలు ఓ సంచిని నోటితో కరిచి లాక్కొచ్చిన క్రమంలో సంచి చిరిగిపోవడం, అందులో నుంచి బంతి లాంటి వస్తువు బయటకు రా వడంతో ఓ కుక్క దానిని తినేందుకు య త్నించగా అది పేలి అక్కడికకడే మృతిచెందింది.
త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ శివప్రసాద్, వన్‌టౌన్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఆర్పీఎఫ్ ఎస్సై సాయి, జీఆర్పీ చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. డాగ్ స్కాడ్ సా యం తో గుర్తు తెలియని వ్యక్తులు ఆ సంచి లో వదిలివెళ్లిన ఐదు నాటుబాంబులను వెలికి తీశారు.