Hyderabad | ఆర్కేపురం, ఫిబ్రవరి 13 : తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వామా? సర్వేల ప్రభుత్వమా..? అని సరూర్‌నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిఅంజన్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రేషన్ కార్డుల కోసం మీ-సేవ కేంద్రంలో తీసుకుంటున్న దరఖాస్తులను గురువారం కార్పొరేటర్ పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క సంవత్సర కాలంలో ఆరు గ్యారెంటీలు దరఖాస్తులు, ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులు, కులగణన, రేషన్ కార్డుల దరఖాస్తులు అని ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం చేసే ఈ సర్వేలతో, దరఖాస్తులతో ప్రజలకు న్యాయం జరగడం లేదు కానీ, ప్రైవేట్ సెంటర్లు ప్రజలను దోచుకుంటున్నాయన్నారు. మీ సేవ సెంటర్‌కు వెళ్తే అక్కడ ఉన్న ప్రజలు సీఎం రేవంత్‌రెడ్డిని తీవ్ర పదజాలంతో దూషిస్తుంటే సీఎంగా రేవంత్‌రెడ్డి పరిపాలన ఏవిధంగా ఉందో అర్థం అవుతుందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం పాలనపై దృష్టిపెట్టి ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు మానుకోవాలన్నారు.