Yoga Training | హైదరాబాద్ : ప్రతీ ఒక్కరూ తమ దైనందిన జీవితంలో యోగా అవలంభించి ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో భారతీయ యోగా సంస్థ (https://yogsansthan.org/) ఉచిత యోగా శిక్షణ ఇస్తుంది. ఇందులో భాగంగా అక్టోబర్ 12 (ఆదివారం)న భారతీయ యోగా సంస్థ 59వ వార్షిక వేడుకల్ని పురస్కరించుకుని ఒక రోజు ఉచిత యోగా శిక్షణను నిర్వహిస్తోంది.
హైదరాబాద్లో ఆటోనగర్ సమీపంలోని హరిణి వనస్థలి పార్కు యోగా శిక్షణా కార్యక్రమానికి వేదిక కానున్నట్లు డిస్ట్రిక్ట్ 2 అధ్యక్షులు వెంకటేశ్వర్లు గౌడ్, కార్యదర్శి ఆర్ యాదగిరి తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్కిల్ ఇన్స్పెక్టర్ , మోటివేషన్ స్పీకర్ వెంకటరెడ్డి హాజరుకానున్నారు.
భారతీయ యోగా సంస్థ రాష్ట్ర అధ్యక్షుడు సుధీర్ కులకర్ణి, కార్యదర్శి సదానంద చారి హైదరాబాద్ జిల్లా అధ్యక్షులు, కార్యదర్శులు జోనల్ సెక్రటరీలు సెంటర్ ఇంచార్జులు సహా సుమారు 400 మందితో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం గం. 5.30 ని.ల నుంచి ఈ ఉచిత యోగా శిక్షణ కార్యక్రమం ప్రారంభం కానుంది.
Thungathurthy : ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ బాకీ కార్డులు : తాటికొండ సీతయ్య
Chandur : బీఆర్ఎస్ కస్తాల గ్రామ నాయకుల ఆర్థిక సాయం
Bihar Elections | ‘మేం బతికే ఉన్నాం’.. ఎన్నికల అధికారులకు బీహార్ గ్రామస్తుల మొర
Rangareddy | 250 గజాల ఇంటి స్థలం కోసం వివాదం.. బాబాయిపై కుమారుడి కత్తి దాడి