కేపీహెచ్‌బీకాలనీ : తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు నిలువెత్తు ప్రతీకలా నిలిచే బతుకమ్మ సంబురాలు శనివారం కూకట్‌పల్లిలో వైభవంగా ప్రారంభమయ్యాయి. ఆచారం ప్రకారం ఒక రోజు ముందే బతుకమ్మ వేడుకలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.
స్థానిక హనుమాన్ దేవాలయం, రామాలయం ఎదుట .. శ్రీరామరామ ఉయ్యాలో.. జయరామరామ ఉయ్యాలో అంటూ.. బతుకమ్మ ఆటాపాటలతో ఆడపడుచులు సందడి చేశారు. పీఎన్ఎం పాఠశాల ఆవరణలో బతుకమ్మ ఆడి.. రంగదాముని చెరువులో బతుకమ్మను, గౌరమ్మను నిమజ్జనం చేశారు.