Bandi Sai Bhageerath | హైదరాబాద్ : మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను 9 రోజుల హైడ్రామాకు తెరదించుతూ సైబరాబాద్ పోలీసులు రీసెంట్గా అరెస్టు చేశారని తెలిసిందే. పోక్సో కేసు నిందితుడు బండి సాయి భగీరథ్‌ను చర్లపల్లి జైలుకు తరలించగా.. పోలీస్ కస్టడీకి అనుమతి లభించింది.
సాయి భగీరథ్‌ను మూడు రోజుల విచారణకు అనుమతిస్తూ మేడ్చల్ మల్కాజ్గిరి కోర్టు ఇప్పటికే ఉత్తర్వులు కూడా జారీ చేసింది. మూడు రోజుల కస్టడి నేపథ్యంలో బండి సాయి భగీరథ్‌ను వైద్య పరీక్షల నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. సాయి భగీరథ్‌ను వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం విచారణ నిమిత్తం మొయినాబాద్‌లోని అరణ్య ఫాం హౌసుకు పోలీసులు తరలించారు.
విచారణ నిమిత్తం బండి భగీరథ్‌ను మొయినాబాద్‌లోని అరణ్య ఫాం హౌసుకు తరలించిన పోలీసులు https://t.co/bns2MfJpqB pic.twitter.com/zYgzPcPwMy
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026
బండి భగీరథ్ మూడు రోజుల కస్టడి నేపథ్యంలో వైద్య పరీక్షల నిమిత్తం మేడ్చల్ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకువచ్చిన పోలీసులు https://t.co/hDUjlo6ZeN pic.twitter.com/c1BtcmOwoV
— Telugu Scribe (@TeluguScribe) May 27, 2026