Hyderabad | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో ఊరేగింపులు, వేడుకల సందర్భంగా విపరీత శబ్ద కాలుష్యానికి దారి తీస్తున్న డీజేలపై హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. డీజే సౌండ్ కారణంగా ఇబ్బందులు పడుతున్నామని 100కు భారీ సంఖ్యలో ఫిర్యాదులు రావడంతో సమీక్షించిన పోలీసులు.. డీజేలపై నిషేధం విధించాలని నిర్ణయించారు. ఈ మేరకు హైదరాబాద్ పోలీసు కమిషనర్ సీవీ ఆనంద్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
డీజేల అంశంపై ఇటీవల బంజారాహిల్స్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జీహెచ్ఎంసీ కమిషనర్ ఆమ్రపాలి, ఎమ్మెల్యేలు దానం నాగేందర్, రాజా సింగ్, పాషాఖాద్రీ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి, రాచకొండ సీపీ సుధీర్ బాబుతో పాటు సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు.
డీజేలపై నియంత్రణ అవసరాన్ని వివరిస్తూ సీవీ ఆనంద్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రెండేళ్లుగా డీజేలతో పెద్ద ఎత్తున నిబంధనల ఉల్లంఘన జరుగుతుందని, ఈ సారి శృతిమించి జరిగిందని, దీనిపై సీఎం రేవంత్ రెడ్డి కూడా ఆరా తీశారని సీపీ తెలిపారు. డీజేలపై నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి..
Hyderabad | రెచ్చిపోయిన కాంగ్రెస్ గూండాలు.. కేటీఆర్ కారుపై దాడి!
Hyderabad | నగరంలో మరో దారుణ హత్య.. ఇంట్లో ఉన్న మహిళను హతమార్చిన దుండగులు
Operation Musi | లక్షన్నర ఇండ్లకు మార్కింగ్.. సుందరీకరణ పేరుతో మూసీలో ముంచేందుకు రంగం సిద్ధం!