Balapur Ganesh | బాలాపూర్ గణేష్ శోభాయాత్ర ప్రశాంత వాతావరణంలో కొనసాగుతోంది. బాలాపూర్ గణనాథుడు అశేష జనవాహిని, భక్తుల సాంస్కృతిక కార్యక్రమాలు, సంప్రదాయ నృత్యాల మధ్య ఫలక్ నుమా రైల్వే స్టేషన్, ఫరూక్ నగర్ బస్సు డిపో మీదుగా చార్మినార్‌కు చేరుకున్నాడు. అబిడ్స్- లిబర్టీ చౌరస్తా మీదుగా బాలాపూర్ విఘ్నేశ్వరుడు ట్యాంక్ బండ్‌కు చేరుకోనున్నాడు.
మరోవైపు బాలాపూర్ నిమర్జన ఏర్పాట్లను సౌత్ జోన్ డీసీపీ స్నేహ మెహరా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. కాగా బాలాపూర్ గణేశ్ లడ్డూ రికార్డు ధర పలికింది. వేలం పాటలో లింగాల దశరథ్ గౌడ్ అనే వ్యక్తి లడ్డూను రూ.35 లక్షలకు దక్కించుకున్నాడు. బాలాపూర్ గణనాథుడి లడ్డూను దక్కించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు పోటీపడ్డారు. గతేడాది బాలాపూర్ లడ్డూ రూ.30.01 లక్షలు పలికిన విషయం తెలిసిందే.
బాలాపూర్ గణేశ్ శోభాయాత్ర వీడియో..
Boy Accidentally Fires Air Gun | ప్రమాదవశాత్తు ఎయిర్ గన్ పేల్చిన బాలుడు.. అతడి అన్న మృతి
Siddaramaiah | కర్ణాటక సీఎం కారుపై చలానాలు.. డిస్కౌంట్లో కట్టిన సిబ్బంది
Vijayawada Utsav | విజయవాడలో క్రేజీ ఈవెంట్స్.. చిరంజీవి, బాలకృష్ణ, పవన్ కల్యాణ్ సందడి..!