శామీర్‌పేట, ఏప్రిల్ 6 : ఒరిస్సా నుంచి హర్యానాకు తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని బాలానగర్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు పట్టుకున్నారు. దాదాపు 273 కిలోల గంజాయితో పాటు ముగ్గురు ముఠా సభ్యులను అందుపులోకి తీసుకున్నారు. శామీర్‌పేట పోలీస్ స్టేషన్లో ఆదివారం నిర్వహించిన ప్రెస్మీట్లో డీసీపీ వివరాలు వెల్లడించారు.
పంజాబ్‌కు చెందిన నగరంలోని బోయిన్‌పల్లిలో నివాసం ఉంటు పర్దీప్‌కుమార్ అలియాస్ అజయ్‌శర్మ వృత్తి రీత్యా తన బొలోరో వాహనంతో బోయిన్‌పల్లిలో నివాసం ఉండే హర్యా నాకు చెందిన సన్నీ డ్రైవర్‌గా, బోయిన్‌పల్లిలో నివాసం ఉండే హర్యానాకు చెందిన మనీష్‌కుమార్ హెల్పర్‌గా ప్యాకర్స్ ఆండ్ మూవర్స్‌గా పని చేస్తున్నారు. ప్రవృత్తిగా గంజాయి అమ్మకం, రవాణ వంటి మాదకద్రవ్యాల్లో ముఠా సభ్యులుగా పని చేస్తున్నారు.
కాగా పర్దీప్‌కుమార్ హర్యానాకు చెందిన (గతంలో ఎన్సీమీ కేసులో శిక్ష పడిన వ్యక్తి) సాహిల్‌తో కలిసి ఒరిస్సా నుంచి హర్యా నాకు పెద్దమొత్తంలో తరలించేందుకు ఒరిస్సాకు చెందిన సప్లయర్ సుభాష్ బిస్వాస్‌తో ఒప్పందం కుదుర్చుకున్నారు. మార్చి 31న కొనుగోలు చేసిన గంజాయిని ప్యాకర్స్ అడ్ మూవర్స్‌గా పని చేస్తున్న ముసుగులో ఎండు గంజాయిని తరలించేందుకు పథకం పన్నారు.
ఆదివారం హైదరాబాద్ మీదుగా వెళ్ళున్న ఈ ముఠాను పక్కా సమాచారంతో బాలానగర్ ఎస్వోటీ, శామీర్‌పేట పోలీసులు ఆదివారం తెల్లవారు జామున శామీర్‌పేట ఓఆర్ఆర్ వద్ద వాహనాన్ని పట్టుకుని తనిఖీ చేశారు. మొత్తం రూ.1 కోటి ఒక లక్ష విలువ చేసే దాదాపు 273 కిలోల గంజాయి, బోలోరో వాహనం, 7 సెల్ ఫోన్లు, ఒక జియో డాంగిల్‌తో పాటు తరలిస్తున్న పర్దీప్‌కుమార్ అలియాస్ అజయ్‌శర్మ, సన్నీ, మనీష్‌కుమార్ ముగ్గురు వ్యక్తులను అందుపులోకి తీసుకున్నారు.
ముఠా సభ్యులైన మరో సాహిల్, సుభాష్ బిస్వాస్‌లు పరారీలో ఉన్నట్లు డీసీపీ తెలిపారు. కాగా సన్నీపై పోలీసులపై దాడి కేసు హర్యానాలో, సాహిల్‌పై ఎన్సీబీ కేసులు ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సమావేశంలో ఎస్వోటీ శ్రీనివాస్, సైబరాబాద్ ఎస్వోటీ అడిషనల్ డీసీపీ పి. విశ్వ ప్రసాద్, ఏసీపీ రాములు, సీఐలు ఎస్. శ్రీనాథ్, శివకుమార్, డీఐ గంగాధర్, ఎస్ఐలు ధశరత్, హారిక, పరశురామ్, సిబ్బంది పాల్గొన్నారు.
శామీర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద ..
శామీర్ పేట్, ఏప్రిల్ 6 : ఇతర ప్రాంతాల నుంచి నగరానికి తరలిస్తున్న భారీ మొత్తంలో గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. ఎస్ఓటీ శామీర్ పేట్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగరానికి గంజాయిని తరలిస్తున్న పక్క సమాచారంతో ఎస్ఓటీ శామీర్ పేట్ పోలీసులు శామీర్ పేట్ ఓఆర్ఆర్ వద్ద ఆదివారం తెల్లవారు జామున సుమారు 300 కిలోల గంజాయిని పట్టుకున్నారు. కొంత మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. పూర్తి వివరాలను సాయంత్రం ప్రెస్ మీట్ లో వెల్లడించనున్నట్లు సీఐ శ్రీనాథ్ తెలిపారు.