Auto Drivers Strike | రోడ్డెక్కిన ఆటోడ్రైవర్లు.. ఎంజేమార్కెట్‌లో ఉద్రిక్తత .. వీడియో
Auto Drivers Strike | కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.
Auto Drivers Strike | తమ డిమాండ్లను నెరవేర్చాలంటూ ఆర్టీసీ కార్మికులు, సిబ్బంది సమ్మె సైరన్ మోగించి.. రోడ్డెక్కి ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. ఆర్టీసీ కార్మికుల ఆందోళనకు దిగొచ్చిన ప్రభుత్వం వారితో సానుకూల వాతావరణంలో చర్చలు జరిపి సమ్మెకు ముగింపు పలికింది. ఇక కాంగ్రెస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలకు ఫ్రీ బస్ స్కీమ్‌తో ఇప్పటికే ఆటో డ్రైవర్లు సరిపడా ఆదాయం లేక కుటుంబాలను పోషించుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో తాజాగా ఆటో డ్రైవర్లు ఆందోళన బాట పట్టారు.
ఎంజేమార్కెట్‌లో చౌరస్తాలో ఆటో డ్రైవర్లు నిరసన బాట పట్టారు. ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరసన వ్యక్తం చేశారు. ఆందోళన ఉదృతం కావడంతో ఓ ఆటో డ్రైవర్ డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేశాడు. దీంతో అక్కడే పోలీసులు, తోటి డ్రైవర్లు అతన్ని అడ్డుకున్నారు.
సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆటో డ్రైవర్లు గంట నుండి ధర్నా కొనసాగిస్తున్నారు. ధర్నా నేపథ్యంలో ఆయా ప్రధాన మార్గాల్లో రాకపోకలు స్తంభించిపోయి వాహనాలు భారీగా నిలిచిపోయాయి.
హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఆటో డ్రైవర్లు
నిన్న ఆర్టీసీ డ్రైవర్లు.. ఇవాళ ఆటో డ్రైవర్లు
ఎంజే మార్కెట్ చౌరస్తాలో ఆటో డ్రైవర్ల నిరసన
డీజిల్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసిన ఆటో డ్రైవర్
ఆటో మీటర్‌పై ఛార్జీలు పెంచడంతోపాటు.. జిల్లా ఆటోలను హైదరాబాద్‌లోకి పర్మిషన్ ఇవ్వొద్దంటూ నిరస… pic.twitter.com/ukBr6LpBZ0
— Telugu Scribe (@TeluguScribe) April 25, 2026
Read Also :
Scientists Mysterious Deaths | చైనాలో శాస్త్రవేత్తలు మృతి, అమెరికాలో అదృశ్యం.. అసలేం జరుగుతోంది?
Pappu Yadav | 70-80 శాతం రాజకీయ నేతలు పోర్న్ చూస్తారు: పప్పు యాదవ్
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

