Job Resignation | ఉద్యోగం మానేయాలని అనుకుంటున్నారా? రిజిగ్నేషన్ ఇచ్చే ముందు వీటి గురించి ఆలోచించండి!
Job Resignation | చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడానికి కారణాలు అనేకం ఉంటాయి. పని ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు, తక్కువ జీతం, సరైనగుర్తింపు లభించక పోవడం.. ఇలా విషయం ఏదైనా కావొచ్చు.. ఉద్యోగం మానేయాలనే ఆలోచన ఇప్పుడు చాలామందికి కలుగుతున్నది.
Job Resignation | చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేయడానికి కారణాలు అనేకం ఉంటాయి. పని ఒత్తిడి, ఆఫీస్ రాజకీయాలు, తక్కువ జీతం, సరైనగుర్తింపు లభించక పోవడం.. ఇలా విషయం ఏదైనా కావొచ్చు.. ఉద్యోగం మానేయాలనే ఆలోచన ఇప్పుడు చాలామందికి కలుగుతున్నది. వెంటనే రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్న వారి సంఖ్య కూడా పెరుగుతున్నది. అయితే, రాజీనామాకు ముందు.. ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. కొన్ని విషయాలపై లోతైన స్పష్టత ఉండాలి. ఆ తర్వాతే.. ముందడుగు వేయాలి.
ఇష్టం-అవసరం..
‘ఇష్టపడే పనిని మాత్రమే చేయండి. నచ్చిన రంగాన్నే ఎంచుకోండి’.. కొన్ని దశాబ్దాలుగా మోటివేషనల్ స్పీకర్లు నూరిపోస్తున్న మాటలివి. వినడానికి అద్భుతంగా ఉన్నా.. వీటిని ఆచరణలో పెట్టడం అంత సులువుకాదు. కానీ, చాలామంది ఈ మాటలను నమ్మి.. చేతిలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుంటారు. ఇష్టపడే పని దొరక్క.. ఆర్థిక కష్టాల చట్రంలో ఇరుక్కు పోతారు. అందుకే, అవకాశం వచ్చేవరకు.. మీకు ఆర్థిక స్థిరత్వాన్ని ఇచ్చే ఉద్యోగంలో కొనసాగడమే మంచిది. అది అవసరం కూడా!
అంతకుమించి..
నిజానికి మీ ఉద్యోగ హోదా కన్నా.. మీరే ఎంతో విలువైనవారు. మీ ఐడీ కార్డుపై ఉండే మీ డెజిగ్నేషన్.. మీకు అంతగా నచ్చకపోవచ్చు. కానీ, మీ విలువ కేవలం ఆ హోదాపైనే ఆధారపడి లేదు. మీరు అంటే.. మీ పదవి, మీ జీతం మాత్రమే కాదు. కొన్నేళ్లుగా చిన్నహోదాలోనే కొనసాగుతున్నంత మాత్రాన.. చింతించాల్సిన అవసరమూ లేదు. ఎందుకంటే, ఆఫీస్‌లో మీ హోదా.. ఓ వ్యక్తిగా, ఓ మంచి భాగస్వామిగా, ఓ బాధ్యతాయుతమైన పేరెంట్‌గా.. మీ విలువను తగ్గించలేదు. అందుకే, మీ విలువను మీ ఉద్యోగ హోదాతో ముడిపెట్టడం మానేయండి.
వేరు చేయాల్సిందే..
ఉద్యోగం, ఆత్మగౌరవం.. ఒకే ఒరలో ఇమడలేని కత్తులు. ఆత్మగౌరవం కోసం ఆరాటపడితే.. ఉద్యోగంలో ఆత్మసంతృప్తి పొందలేరు. అందుకే, మీ ఆత్మగౌరవాన్ని మీ ఉద్యోగం నుంచి వేరు చేయండి. అప్పుడే మీ జీవితాన్ని మరింతగా ఆస్వాదించడం మొదలుపెడతారు. వృత్తిపరమైన ఎదురుదెబ్బలను వ్యక్తిగతంగా తీసుకోవడం మానేస్తారు.
అన్వేషణ మొదలు పెట్టండి..
ఉద్యోగం మానేయడమే మేలు.. అనే స్పష్టత మీలో ఉంటే, నిరభ్యంతరంగా ముందుకు సాగండి. కానీ, రాజీనామా చేయడానికి ముందే.. మీకున్న ఇతర అవకాశాలను పరిశీలించుకోండి. ఎప్పటి నుంచో నేర్చుకోవాలి అనుకుంటున్న కోర్సును ఇప్పుడే ప్రారంభించండి. మీరు ఆసక్తి చూపిస్తున్న రంగంలోని నిపుణులతో చర్చించండి. ఫ్రీలాన్సింగ్ లాంటివీ ప్రయత్నించి చూడండి. ఉద్యోగంలో కొనసాగుతూనే ఇలాంటి ప్రయత్నాలు చేయడం వల్ల.. మీకు ఓ సేఫ్టీ నెట్ ఉంటుంది.
చివరగా.. ఈ అంశాలన్నిటినీ పరిశీలించిన తర్వాత, మీరు ఉద్యోగం మానేయాలా? వద్దా? అనే దానిపై ఒక నిర్ణయానికి రండి. అన్నిటిపైనా స్పష్టత తెచ్చుకొని.. మీ పునాదిని మరింత బలోపేతం చేసుకోండి. సమయం తీసుకుని అన్నిటికీ సిద్ధమవ్వండి. పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ తదుపరి అడుగు వేయండి. మీ జీవితాన్ని మార్చుకునే హక్కు.. మీ చేతుల్లోనే ఉంటుందని గుర్తుంచుకోండి.
Read Today's Latest Lifestyle News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

