టేకులపల్లి, జూలై 11: సీడ్స్, ఫెస్టిసైడ్స్, ఫెర్టిలైజర్ వెల్ఫేర్ అసోసియేషన్ టేకులపల్లి మండల నూతన కమిటీ ఎన్నిక ఏకగ్రీవమైంది. ఖమ్మం జిల్లా టేకులపల్లి మండలంలోని చుక్కలబోడు రైతు వేదికలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో నూతన కమిటీని ఎన్నుకున్నారు. టేకులపల్లి మండలం నూతన కమిటీ అధ్యక్షులుగా నాగినేని రాఘవ, కార్యదర్శిగా భూక్యా లవ కుమార్ , కొందరు సభ్యులను ఎన్నుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు నల్ల సోమసుందర్ మాట్లాడుతూ.. సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేయాలని నూతన కమిటీకి సూచించారు. ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ వ్యాపారుల సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడం, సభ్యుల సంక్షేమం కోసం నిరంతరం పనిచేయడం, సంఘాన్ని మరింత బలోపేతం చేయడం నూతన కమిటీ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
ఇక నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. సభ్యులందరినీ కలుపుకొని సంఘ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. సమస్యల పరిష్కారంలో ముందుండి పనిచేస్తామని హామీ ఇచ్చారు.