హిమాయత్‌నగర్, మార్చి 27: ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ కొరత లేకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ ఆటో రిక్షా డ్రైవర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి. వెంకటేశం డిమాండ్ చేశారు. శుక్రవారం హిమాయత్‌నగర్‌లోని ఎస్‌ఎన్‌రెడ్డి భవన్లో యూనియన్ నగర ముఖ్య నేతల సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ కొరతతో రోజు వారీగా ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగించే వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.పెంచిన ఆటో ఎల్పీజీ గ్యాస్ ధర రూ.120ని తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో యూనియన్ నగర అధ్యక్షుడు ఎస్.అశోక్,నగర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. జంగయ్య, నేతలు ఒమర్‌ఖాన్, ఎం.నర్సింహ, పి.శ్రీనివాస్, ఎం.కృష్ణ, లతీఫ్, మల్లికార్జున్, మురళీ, కె.రవి తదితరులు పాల్గొన్నారు.