జూబ్లీహిల్స్, ఫిబ్రవరి 15: అసంపూర్తిగా వదిలేసిన నాలా నిర్మాణ పనులను అధికారులు యుద్ధప్రాతిపదికన చేపట్టారు. శనివారం తండ్రితో కలిసి బైక్‌పై పాఠశాలకు వెళ్తున్న ఎనిమిదేండ్ల చిన్నారి కృష్ణానగర్ బీ బ్లాక్‌లో ఓ టిఫిన్ సెంటర్ ఎదురుగా నాలాలో పడిపోవడంతో స్పల్ప గాయాలయ్యాయి. ఈ విషయమై ఆదివారం నమస్తే తెలంగాణ దిన పత్రికలో ‘అసంపూర్తిగా నాలా నిర్మాణం’ శీర్షికన వచ్చిన వార్తకు హెచ్ఎంఎస్బీ అధికారులు స్పందించారు. జలమండలి డివిజన్-6 జీఎం ప్రభాకర్‌రావు ఆదేశాలతో ఎల్లారెడ్డిగూడ సెక్షన్ మేనేజర్ శ్యామ్, సిబ్బందితో కలిసి సివరేజీ లైన్‌పై స్లాబ్ నిర్మించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు.