రాయ్‌పూర్, జూలై 25: ఉద్యోగ నియామక పరీక్ష పేపర్ల లీక్ కేసులో మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఆరోపణలపై ఛత్తీస్‌గఢ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (సీజీపీఎస్సీ) మాజీ చైర్మన్ తమన్ సింగ్ సోన్వానీని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ శనివారం అరెస్ట్ చేసింది. స్టేట్ సర్వీస్ కమిషన్ ఆధ్వర్యంలో 2020, 2021 లలో జరిగిన ఉద్యోగ నియామక పరీక్షలో ప్రశ్న పత్రాల లీకేజీకి పాల్పడటమే కాక, మనీలాండరింగ్ చేసిన ఆరోపణలపై పీఎంఎల్ఏ కింద అతడిని ఈడీ అరెస్ట్ చేసింది.
అనంతరం రాయ్‌పూర్‌లోని ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టులో హాజరుపర్చగా, ఈడీ అతడిని కస్టడీకి కోరింది. 2023లో ఛత్తీస్‌గఢ్‌లో కాంగ్రెస్ ఓడిన తర్వాత అధికారం చేపట్టిన బీజేపీ అతడి అక్రమాలపై విచారణ చేపట్టింది. పలువురి నుంచి లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుని ఉద్దేశపూర్వకంగా ప్రశ్న పత్రాలు లీక్ చేశారని, రిక్రూట్మెంట్ నిబంధనలు మార్చారన్న అభియోగాలతో 2024లో సీబీఐ అతడిని అరెస్ట్ చేసింది.