(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): నీట్ పేపర్ లీకేజీకి వ్యతిరేకంగా జెన్‌జీ విద్యార్థులు సాగించిన ఉద్యమంతో కేంద్ర విద్యామంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు. అయితే, ఈ రాజీనామాకు కేంద్రం కట్టుబడి ఉంటుందా? లేక, ఏదో మెలికతో ప్రధాన్‌ను మళ్లీ క్యాబినెట్లోకి తీసుకొంటుందా? అనే చర్చ ఇప్పుడు జరుగుతున్నది. 2020-21లో తీసుకొచ్చిన మూడు నల్ల చట్టాల ఉదంతాన్ని ఈ సందర్భంగా పలువురు గుర్తు చేస్తున్నారు.
ఢిల్లీలో రైతుల నిరసనలకు తలొగ్గిన కేంద్ర ప్రభుత్వం మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకొంటున్నట్టు ప్రకటించింది. అయితే, 2024-25లో డ్రాఫ్ట్ నేషనల్ పాలసీ ఫ్రేమ్‌వర్క్ ఆన్ అగ్రికల్చర్ మార్కెటింగ్ పేరిట కొత్త ప్రతిపాదనలు తెచ్చింది. వెనక్కి తీసుకొన్న సాగు చట్టాలను దొడ్డిదారిన తీసుకురావడానికే ఈ పాలసీ ఫ్రేమ్‌వర్క్‌ను తెచ్చారంటూ ప్రతిపక్ష పార్టీలు మండిపడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రధాన్ రాజీనామా నిర్ణయానికి కేంద్రం కట్టుబడి ఉంటుం దా? లేదా? అనే చర్చ మొదలైంది.