బేగంపేట్, జూలై 25: సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రి కార్డియోథొరాసిక్ సర్జరీ విభాగంలో నూతనంగా ఏర్పాటు చేసిన అత్యాధునిక హార్ట్లంగ్ మిషన్ను టీజీఎంఎస్ఐడీసీ ఎండీ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ శనివారం ఉదయం ప్రారంభించారు.
ఈ యంత్రం ద్వారా గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నట్టు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ వాణి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఇందిర, డాక్టర్ రవీంద్ర తదితరులు పాల్గొన్నారు.