హైదరాబాద్, జనవరి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నగరంలోని వివిధ ప్రాంతాల్లో అందుబాటులో ఉన్న 137 ఓపెన్ ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని తెలంగాణ రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ నిర్ణయించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్, కుర్మల్‌గూడ, మేడ్చల్-మలాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతాల్లో మౌలికవసతులతో ఉన్న ప్ల్లాట్లకు ఫిబ్రవరి 7, 8 తేదీల్లో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్టు రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ గౌతం తెలిపారు.
ఆయా ప్రాంతాలను బట్టి బహిరంగమారెట్ కంటే తకువ ధరల్లోనే అందుబాటులో ఉన్నాయని, సొంతస్థలంలో ఇంటిని కట్టుకోవాలనుకునే వారికి అనుకూలంగా ఉంటాయని ఎండీ తెలిపారు. మంచి కనెక్టివిటీ, క్లియర్ టైటిల్‌తో యంత్రాంగమే లేఔట్లను అభివృద్ధి చేయడంతో మంచి డిమాండ్ ఉందని, ఆసక్తి గలవారు నిర్ణీత ధరావత్తును మీసేవ కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా లేదంటే డీడీ విధానాల్లో కూడా చెల్లించవచ్చని సూచించారు.