సిటీబ్యూరో, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్‌లో రియల్ రంగాన్ని హెచ్ఎండీఏ పరుగులు పెట్టిస్తున్నది. ప్రతి ఒక్కరూ సొంతింటి కలను నేరవేర్చుకునేందుకు ఆరాటపడుతున్న తరుణంలో ప్రజల డిమాండ్‌కు అనుగుణంగా ప్లాట్లను ఈ వేలంలో అమ్మకానికి పెడుతున్నది. 100శాతం ఎలాంటి చిక్కుల్లేని క్లియర్ టైటిల్‌తో స్థలాలు ఉండటం, సంపూర్ణమైన భూ యాజమాన్య హక్కులు కలిగి ఉండటం, సత్వర నిర్మాణానికి అనువుగా ప్లాట్లు, చక్కని మౌలిక వసతులు ఉండటంతో హెచ్ఎండీఏ ప్లాట్లను దక్కించుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు పోటీ పడుతున్నారు. అత్యంత పారదర్శకంగా ఈ వేలం జరుగుతుండటంతో ఈ వేలానికి అందరూ మొగ్గు చూపుతున్నారు. ఈ నేపథ్యంలో రంగారెడ్డి, మేడ్చల్ -మల్కాజిగిరి, సంగారెడ్డి జిల్లాల పరిధిలో భూముల అమ్మకానికి తాజాగా హెచ్ఎండీఏ నోటిఫికేషన్ విడుదల చేసింది. రంగారెడ్డి జిల్లాలోని బైరాగిగూడ, మంచిరేవుల, పీరం చెరువు, కోకాపేట, నల్లగండ్ల, బుద్వేల్, చందానగర్‌లో స్థలాలను విక్రయించనున్నారు. మేడ్చల్‌లో బాచుపల్లి, బౌరంపేట, చెంగిచర్ల, సూరారం, సంగారెడ్డిలో వెలిమల, నందిగామ, అమీన్పూర్, రామేశ్వరం బండ, పతిఘన్పూర్, కిష్ణారెడ్డి పేటలో స్థలాలు విక్రయించనున్నారు. కాగా ఈ నెల 16న రిజిస్ట్రేషన్లను స్వీకరించనున్నది. 18వ తేదీన రెండు సెషన్లలో ఈ వేలం నిర్వహించనున్నారు.
ఈ-వేలం షెడ్యూల్ వివరాలు
రంగారెడ్డి జిల్లాలో..
గ్రామం / మండలం విస్తీర్ణం నిర్ధారించిన ధర
చదరపు గజాలలో (చ.గజానికి, రూ.ల్లో)
సర్వే నంబరు 57, బైరాగిగూడ, గండిపేట 2420 35,000
సర్వే నంబరు 430, మంచిరేవుల, గండిపేట 5082 50,000
సర్వే నంబరు 44, పీరం చెరువు 4477 50,000
సర్వే నంబరు 144, కోకాపేట గండిపేట 8591 65,000
సర్వే నంబరు 161, నల్లగండ్ల, శేరిలింగంపల్లి 2420 65,000
సర్వే నం 188, నల్లగండ్ల శేరిలింగంపల్లి 4840 65,000
సర్వే నం 174, చందానగర్, శేరిలింగంపల్లి 1694 50,000
సర్వే నం 89, బుద్వేల్ రాజేంద్రనగర్ 4356 50,000
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలో…
గ్రామం / మండలం విస్తీర్ణం నిర్ధారించిన ధర
చదరపు గజాలలో (చ.గజానికి, రూ.ల్లో)
సర్వే నం 363, బాచుపల్లి 2299 30,000
సర్వే నం 425, బాచుపల్లి 605 25,000
సర్వే నం 694, బౌరంపేట, గండిమైసమ్మ 2420 24,000
సర్వే నం 130, బౌరంపేట, గండిమైసమ్మ 530 24,000
సర్వే నం 130, బౌరంపేట , గండిమైసమ్మ 1500 24,000
సర్వే నంబరు 130, బౌరంపేట, గండిమైసమ్మ 666 24,000
సర్వే నం 33/1 , చెంగిచర్ల, మేడిపల్లి 1210 20,000
సర్వే నం 166, 167, సూరారం, కుత్బుల్లాపూర్ 4840 25,000
సంగారెడ్డి జిల్లా పరిధిలో…
గ్రామం / మండలం విస్తీర్ణం నిర్ధారించిన ధర
చదరపు గజాలలో (చ.గజానికి, రూ.ల్లో)
సర్వే నం 507, వెలిమల, ఆర్సీ పురం 5929 20,000
సర్వే నం 823 (పీ1), అమీన్పూర్ 514.25 40,000
సర్వే నం 823 (పి 2), అమీన్పూర్ 514.25 40,000
సర్వే నం 823 (పి 3), అమీన్పూర్ 302.50 40,000
సర్వే నం 250, అమీన్పూర్ 1452 40,000
సర్వే నం 227, వెలిమల, ఆర్సీ పురం 1210 15,000
సర్వే నం 273, రామేశ్వరం బండ, పటాన్చెరు 1089 12,000
సర్వే నం 281, పతిఘనపూర్, పటాన్చెరు 7502 16,000
సర్వే నం 177, కిష్ణారెడ్డి పేట్, అమీన్పూర్ 1452 18,000