కేపీహెచ్‌బీ కాలనీ, డిసెంబర్ 10 : సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఎనిమిదేండ్ల పాలనలో జరిగిన అభివృద్ధి.. పేదలకు అందుతున్న సంక్షేమ పథకాలకు ఆకర్షితులై పలు పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శనివారం క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే సమక్షంలో మూసాపేట డివిజన్ అవంతినగర్ తోటకు చెందిన 15 మంది బీజేపీ నేతలు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ర్టాన్ని అనతి కాలంలోనే కనీవిని ఎరుగనిరీతిలో అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు.
హైదరాబాద్ నగరం విశ్వనగరంగా అభివృద్ధి సాధిస్తున్నదన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలోని కాలనీలు, బస్తీల్లో జరిగిన అభివృద్ధి పనులను చూసి వివిధ పార్టీల నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. పార్టీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. కూకట్పల్లి నియోజకవర్గంలో వేలాది కోట్ల నిధులతో ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్న ఘనత ఎమ్మెల్యే కృష్ణారావుదే అని అన్నారు. అభివృద్ధికి నోచుకోని బస్తీలు, కాలనీల్లో సమస్యలు పరిష్కరిస్తూ నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు కృష్ణారావు అని అన్నారు.
సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌లతోపాటు ఎమ్మెల్యే కృష్ణారావు పనితీరుకు ఆకర్షితులమై బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్‌కుమార్, అధ్యక్షుడు అంబటి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.