బండ్లగూడ,ఆగస్ట్ 16 : డ్రగ్స్ కట్టడి కోసం పోలీసులు తనిఖీలను ముమ్మరం చేశారు. ఎక్కడికక్కడ చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరాను అడ్డుకుంటున్నారు. తాజాగా అత్తాపూర్‌లో గంజాయి(Ganja) తరలిస్తున్న దంపతులను(Couple arrest) పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళ్తే..అత్తాపూర్ ఫిల్లర్ నెంబర్ 162 వద్ద షకీల్ అనే వ్యక్తి తన ద్విచక్ర వాహనంపై భార్యతో కలిసి జలాలబాబా నగర్ వైపు వెళ్తున్నాడు. అనుమానం వచ్చిన పోలీసులు తనఖీలు చేశారు. ఈ తనిఖీలో రెండు కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. తాండూరు నుంచి గంజాయిని తీసుకువచ్చి నగరంలో అమ్ముతున్నట్లు నిందితులు నేరం అంగీకరించారు. వారిపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.